Loading...

12, జనవరి 2022, బుధవారం

పొత్తులపై ఒకే మాట మాట్లాడుదాం


- ప్రతి జనసైనికుడి ఆలోచనతో పొత్తులపై నిర్ణయం - జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

పొత్తుల అంశంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. పొత్తుల విషయంలో ఒక్కడినే నిర్ణయం తీసుకోనన్నారు. ప్రతి జనసైనికుడి ఆలోచనతో పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే బీజేపీతో జనసేన పొత్తులో ఉందని, పలు పార్టీలు జనసేనతో పొత్తు కోరుకోవచ్చన్నారు. జనసేన క్షేత్రస్థాయిలో పుంజుకుంటోందని, పొత్తులపై ఒకే మాట మాట్లాడుదామని, పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెడదామని పార్టీ శ్రేణులకు పవన్‌ సూచించారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే విషయంలో తానొక్కడినే నిర్ణయం తీసుకోబోనని.., ప్రతి జనసైనికుడి ఆలోచనతోనే పొత్తులపై నిర్ణయం ఉంటుందని అన్నారు. జనసేన కార్యనిర్వాహక సభ్యులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన పవన్.. ఇప్పటికే భాజపాతో జనసేన పొత్తులో ఉందన్నారు. పలు పార్టీలు జనసేనతో పొత్తు కోరుకోవచ్చునని.., అదంతా మైండ్ గేమ్ అనుకోవచ్చునని పవన్ అన్నారు. జనసేన క్షేత్రస్థాయిలో పుంజుకుంటోందని.. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టిపెట్టాలని శ్రేణులకు సూచించారు. ఇదిలావుంటే, ఇటీవ‌ల చిత్తూరులోని త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పం ప‌ర్య‌ట‌న‌లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లుచేశారు. జనసేనతో పొత్తుపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ‘పొత్తులు పెట్టుకున్నప్పుడే టీడీపీ గెలిచిందని వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఇతర పార్టీలతో కలిసి పోటీ చేసినప్పుడు గెలిచాం, ఓడిపోయాం కూడా. రాష్ట్ర ప్రయోజనాల మేరకు పరిస్థితులకు అనుగుణంగా పొత్తులపై నిర్ణయం తీసుకుంటాం’ అని స్పష్టం చేశారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు మ‌రోసారి జ‌న‌సేన‌తో పొత్తుకు సిద్ధ‌మ‌య్యార‌నే చ‌ర్చ‌లు వ‌చ్చాయి. ఇప్పుడు జ‌న‌సేనాని ప‌వ‌న్ ఈ క్ర‌మంలోనే చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిగా మారాయి. మ‌రి మున్మందు ఏం జ‌రుగుతుందో చూడాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి