Loading...

ఆరోగ్యవారధి


------------------------------------------------------------------------

స్నానపు గదిలో దాగిఉన్న ఆరోగ్యం

ఆరోగ్యవారధి: స్నానపు గదులు ఎంత పరిశుభ్రంగా వుంచుకుంటే అంతే ఆరోగ్యంగా ఇల్లు ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసినప్పటకీ ఇతర పనుల వ్యాపకంలో పడిపోయి దీనిని మర్చిపోతుంటారు. మన ఇళ్ళు ఎంత అందంగా ఉంచుకుంటామో అంతే అందంగా, పరిశుభ్రంగా ఇంట్లోని స్నానపు గదులు ఉంచుకోవడం అవసరం. దీని వల్ల ఇంట్లోని సభ్యులకు ఎటువంటి రోగాలు దరిచేరవు. మారుతున్న కాలానికి అనుగుణంగా స్నానపు గదుల రూపురేఖలు కొత్తదనాన్ని సంతరించుకుంటున్నాయి. ముఖ్యంగా టాయిలెట్ బౌల్ చాలా పరిశుభ్రంగా, క్రిములు, కీటకాలు చేరకుండా జాగ్రత్త పడాలి. చెత్త బుట్ట పెట్టకూడదు. నీటి టేప్‌లు సక్రమంగా వినియోగిస్తూ, యాంటీ బాక్టిరియా వంటి క్రిమి సంహారక మందులు ఉపయోగించాలి. మగ్, టూత్‌పెస్ట్, టూత్‌బ్రెష్, రేజర్ వంటి క్రిములు చేరని ప్రదేశంలో పెట్టుకోవాలి. టాయిలెట్ క్లీనర్ వినియోగించే ముందు వాటిని రాసివున్న నియమాలను అవగాహన చేసుకోవాలి. షవర్‌ను ఎప్పటికప్పుడు ఉపయోగించిన తర్వాత పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి. అద్దాలను ప్రతీ రోజూ శుభ్రపరచాలి. బాత్‌రూంలో గాలి ఒకే దగ్గర ఉండిపోతుంది. ఈ పరిస్థితి దృష్ట్యా ఎగ్జాస్ట్ ఫ్యాన్ అమర్చికోండి. ఉపయోగించిన తర్వాత కుంకుడికాయల వ్యర్థాలు, షాంపూ ప్యాకేట్ల ఉండిపోకుండా వెంట వెంటనే శుభ్రపరిచి, ఆ గది పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి. పిల్లలు స్నానం చేసేటప్పుడు చిన్నవాళ్ళయితే వాళ్ళుస్నానం చేసే వరకు వాళ్ళతోనే ఉండాలి. ఒక వేళ ఆ సమయంలో ఫోన్ వచ్చిన, కాలింగ్ బెల్ మోగినా వెళ్ళొద్దు. క్రిమి సంహారక మందులు పిల్లలకు దూరంగా పెట్టుకోవాలి. పిల్లలకు స్నానం చేయించే ముందు వేడినీళ్ళను ఒకటికి రెండుసార్లు చెక్ చేయండి. తడిగా ఉన్న ప్రదేశంలో ఎలక్ట్రికల్‌కి సంబంధించిన వస్తువులు ఉండకుండా చూసుకోవాలి. సరైన మేట్స్‌ను వాడాలి. వయస్సు మీద పడ్డవారికి సౌకర్యాంగా మన స్నానపు గదులు ఉంచుకోవాలి. నాణ్యత విషయంలో ఎటువంటి రాజీలకు వెళ్ళకండి. గదికి పెద్దగా ఉండే కిటికీలు వినియోగించడం వల్ల సహజ సిద్ధమైన కాంతిని లోపలికి వస్తూ, కొంతమేర క్రిములను నాశనం చేస్తుంది.