Loading...

15, నవంబర్ 2010, సోమవారం

బట్టతల చిగురించడానికో మార్గం...

ఆరోగ్యవారధి: నున్నని బట్టతల.... పట్టుమని పాతికేళ్ళయినా నిండలేదు.... ఎవరికి కనిపించినా ఎంతమంది పిల్లలని ప్రశ్నిస్తున్నారు. పెళ్ళికాకనే పిల్లలేంటని బాధగా ఉందా...! ఇది ఒకరి సమస్య కాదు. ఇలా బట్టతలతో ఇబ్బంది పడే వారు చాలా మందే ఉన్నారు. వారి బట్టతల చిగురించడానికి ఆయుర్వేదంలో మంచి మార్గలే ఉన్నాయి. బట్టతల రావడానికి అత్యుష్ణమే కారణం. అతి వేడి కారణంగా వెంట్రుకలకు కావాల్సిన కొవ్వు పదార్థం అందక రాలిపోతుంటాయి. ఇందుకు విరుగు అప్పుడే ఆరంభించాలి. పూర్తిగా బోడి అయిన తరువాత ప్రయత్నం చేస్తే ఏ మాత్రం ఉపయోగం ఉండదు. అందుకే ముందుగా జాగ్రత్త తీసుకోవాలి. లక్క, శుద్ధిచేసిన నాభి, అతి మధురం, చింతాకు, నల్లికాయ రసం, నీలి ఆకులు మెత్తగా నూరి మంచినూనె పోసి బాగా ఉడకపెట్టాలి. వడపోయాలి రాత్రులందు లేపనం చేయాలి. నూరిన మెంతులతో తలకు పట్టించాలి. తెల్లవారి స్నానం చేయాలి. నారింజ రసం, లోహ భస్మం, ప్రవాళ భస్మం తగినంత వేసుకుని భోజనానంతరం రెండు పూటలా తాగాలి. తరువాత తలకు ఎలాంటి తైలాలు వాడ కూడదు. ఫలితంగా బట్టతలపై వెంట్రుకలు మొలిచే అవకాశం ఉంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి