ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ఆ ఆరోపణలు కుట్రలో భాగమే...

-భరిణికం సర్పంచ్ దాట్ల రామ్మూర్తి రాజు
పరవాడ, నవంబర్14, చైతన్యవారధి: ఇటీవల పత్రికలలో తనపై చేస్తున్న ఆరోపణలు కుట్రలో భాగమేనని భరణికం సర్పంచ్ దాట్ల రామ్మూర్తి రాజు అన్నారు. సోమవారం తన నివాసంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. తన ఆస్తిని లాక్కునేందుకు తన బంధువులు కుట్ర పన్నారని, అది తెలిసి వారిపై కేసు పెట్టానన్నారు. అయితే ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు తనకు మతిస్ధిమితం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇటీవల తుఫాను బాధితులకు నష్టపరిహారం పంపిణీలో తన బంధువులు, కొంతమందితో కుమ్మక్కై అవక తవకలకు పాల్పడ్డారన్నారు. అవకతవకలను నిలదీసినందుకు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ముప్పై సంవత్సరాలకు పైగా గ్రామ సర్పంచ్ గా పని చేశానని, గ్రామ సమస్యల గురించి పూర్తి అవగాహన తనకు ఉందన్నారు. తనను అప్రతిష్టపాలు చేసేందుకు తన బంధువులు ప్రత్యర్ధులతో చేతులు కలిపారన్నారు. ఈ వాస్తవాలును తెలిపేందుకే ఈ సమావేసం ఏర్పాటు చేశానన్నారు. పాత్రికేయులు వార్తలను రాసే ముందు వాస్తవాలను సరి చూసుకోవాలన్నారు. ఈ సమావేశంలో వార్డు మెంబర్లు దుర్గునాయుడు, వాసనశెట్టి పైడమ్మ, అనపర్తి సూర్యకుమారి, గ్రామస్ధులు పెదిశెట్టి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు