Loading...

మా గురించి ...

సృష్టిలో సకల సమస్యలకు ఏకైక పరిష్కార మార్గం అవగాహన మాత్రమేనని  చైతన్య వారధి నమ్ముతోంది. ఆ నమ్మకంతోటే సమస్యలపై చైతన్య పర్చేందుకు  సమగ్ర సమాచారంతో మీ ముందుకు వస్తోంది.   ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ సమకాలీన అంశాలపై  విశ్లేషణాత్మకమైన సమాచారాన్ని అందజేస్తూ, మెరుగైన సమాజ నిర్మాణంలో ప్రజలను భాగ స్వాములను చేయుటకు ఈ పత్రిక తన  వంతు ప్రయత్నం చేస్తుంది.  ప్రతి ఒక్కరూ ఉన్నతంగా జీవించే సమాజ నిర్మాణమే ధ్యేయంగా ఈ పత్రిక పని చేస్తుంది. చూట్టూ మార్పులను గమనిస్తూ నిబద్ధతతో వ్యవహారిస్తూ, చూసింది చూసినట్లు, ఉన్నది ఉన్నట్లు నిజాయితీగా ప్రజలకు తెలియజేస్తుంది.  నిత్యం నూతన భావాలు, ఆధునిక పోకడలను వార్తలుగా మలచి పాఠకుల ముందు ఉంచనుంది. అక్షరాలనే ఆత్మీయ నేస్తాలుగా చేసి పాఠకుల సమాచార దాహార్తిని తీర్చడంతో పాటు వారికి విజ్ఞాన, వినోదాల్ని అందించేందుకు సిద్ధమవుతోంది. సమాజంలో నైతిక విలువలు, నీతి నియమాలు పెంపొందించడానికి పాటు పడుతుంది.  అవసరమైతే అక్షరాలను పదునైన ఆయుధాలుగా మల్చి అవినీతి, అన్యాయాలపై దాడి చేస్తుంది. వాటి నిర్మూలనకు అనునిత్యం కృషి చేస్తుంది.  ప్రజా ప్రయోజనమే అంతిమ లక్ష్యంగా, నిజ నిర్ధారణ, ఖచ్చితత్వం, విషయ ప్రాధాన్యతే ప్రాతిపధికగా వ్యవహారిస్తుంది.  సామాజిక, రాజకీయ పరిణామాలపై వ్యక్తిగత రాగ ద్వేషాలకు అతీతంగా, నిష్పాక్షికంగా స్వచ్ఛమైన మనస్సుతో  స్పందిస్తుంది. ప్రజా ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ, ఆధునిక పరిజ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, ప్రజలకు అందజేస్తూ విజ్ఞాన అభివృద్ధిని ఆకాంక్షిస్తుంది. నిజాయితీగా, నిర్భయంగా  నిజాలు రాస్తూ కలం గోప్పతనాన్ని పెంచనుంది. రాజ్యాంగ విలువలను కాపాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేస్తుంది.  సమాజంలో స్వచ్ఛమైన రాజకీయాల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తుంది. పరిణితి, విచక్షణతో వ్యవహారిస్తూ  ప్రజల భావాలకు, ఆకాంక్షలకు, బాధలకు, గాధలకు అక్షరరూపం ఇస్తూ, అవాంఛనీయమైన అంశాలను,  దోషాలను నిర్భయంగా బట్టబయలు చేస్తూ ఉన్నతమైన సామాజిక వ్యవస్థల అభివృద్ధికి సహాకరించనుంది.  మృధువైన, సరళ శైలిలో సలక్షణమైన రచనలతో తెలుగు భాష ఔనత్యాన్ని పెంచుటకు పాటుపడనుంది. అను నిత్యం వైవిధ్య భరితంగా తయారై మీ ముందుకు రానుంది.  మా ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తూ........ ఎడిటర్‌.