Loading...

సినిమా వారధి

 దర్శకుడిగా పవన్ కల్యాణ్...


వైష్ణవి మూవీస్‌ తెలుగమ్మాయి
సినిమావారధి: వైష్ణవి మూవీస్‌ సంస్థ ‘తెలుగమ్మాయి’ చిత్రాన్ని ప్రారంభించింది. వానపల్లి బాబూరావు నిర్మాత. రాజా వన్నెంరెడ్డి దర్శకుడు. సలోని టైటిల్‌ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో విక్రమ్‌ (ఎం.ఎస్‌.నారాయణ తనయుడు), యశ్వంత్‌, హర్ష, సాయిచంద్‌ ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోలో ఆదివారం ఉదయం చిత్రీకరణ ప్రారంభమైంది. డాదాసరి నారాయణరావు, హరిరామజోగయ్య, బి.గోపాల్‌, వి.వి.వినాయక్‌, రాజా వన్నెంరెడ్డి, బాబూరావు, సలోని, యశ్వంత్‌, విక్రమ్‌, హర్ష, సాయిచంద్‌..తదితరులు వేడుకలో పాల్గొన్నారు. నాయకానాయికలపై తొలిసన్నివేశానికి డాదాసరి నారాయణరావు క్లాప్‌నివ్వగా, వి.వి.వినాయక్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. బి.గోపాల్‌ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘నా గత చిత్రాలు..‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’, ‘ఆదివారం ఆడవాళ్లకు సెలవు’ తరహా చిత్రమిది. హాస్యం, సందేశం మేళవించిన యూత్‌ఫుల్‌ స్టోరీతో తెరకెక్కిస్తున్నాం. ‘మర్యాదరామన్న’ చూశాక ఈ చిత్రానికి నాయిక సలోని మాత్రమే అని అనుకున్నాం. నలుగురు అబ్బాయిలు ఒక అమ్మాయికి మధ్య నడిచే కథ ఇది. నిర్మాత బాగా పరిచయం ఉన్న వ్యక్తి. పెద్ద విజయం సాధిస్తామన్న నమ్మకముంది’ అన్నారు.

నిత్య పెళ్లికొడుకు పాటల విడుదల

సినిమావారధి: పోసాని కృష్ణమురళి టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న ‘నిత్య పెళ్లికొడుకు’ పాటలు సుప్రీం మ్యూజిక్‌ ద్వారా విడుదలయ్యాయి. గౌరి పండిట్‌, అంజలి ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘కేరాఫ్‌ జగదంబ సెంటర్‌’ అనేది ఉప శీర్షిక. సోమా విజయ్‌ప్రకాష్‌ సమర్పణ, అళహరి దర్శకత్వంలో సెవెన్‌హిల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై జి.వి.సుబ్బయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఘంటాడి కృష్ణ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆడియో వేడుకలో ప్రముఖ నిర్మాత నట్టికుమార్‌, హీరో శివాజీ, బాబూమోహన్‌, కవిత తదితరులు పాల్గొన్నారు. ఆడియో సీడీని నట్టికుమార్‌ ఆవిష్కరించి హీరో శివాజీకి అందించారు. సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ మాట్లాడుతూ.. ‘మంచి సంగీతం చేయడానికి స్కోప్‌ ఉన్న సబ్జక్ట్‌ కావడం వలన ‘నిత్య పెళ్లికొడుకు’ చిత్రానికి చక్కని సంగీతం అమరింది’ అన్నారు.

 -------------------------------------------------------
 రగడ చేయనున్న నాగార్జున
 

 
సినిమావారధి: కింగ్ నాగార్జున హీరోగా అనుష్క, ప్రియమణి హీరోయిన్లుగా వీరు పోట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం "రగడ". మాస్ ఎంటర్‌టైన్మెంట్ చిత్రాన్ని డి.శివప్రసాద్ రెడ్డి శ్రీకామాక్షి ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం టాకీ పూర్తి చేసుకుని పాటల చిత్రీకరణ కొరకు త్వరలో జోర్డాన్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. నాగార్జున మాట్లాడుతూ.. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందే సినిమా. కడపలో మార్కెట్ యార్డ్ నిర్వహించే పాత్ర నాది. కొత్త తరహాలో రాయలసీమ శ్లాంగ్ మాట్లాడతాను. డిసెంబరులో సినిమా విడుదల చేయడానికి రెడీ అవుతున్న ఈ చిత్రంలోని పాటల చిత్రీకరణకోసం త్వరలో జోర్డాన్ వెళుతున్నట్లు తెలిపారు. చిత్రం గురించి చెపుతూ... సినిమా మొదలుపెట్టినప్పుడే రగడ టైటిల్ గురించి చర్చించుకున్నాం. కొన్ని టైటిల్స్ అనుకున్నాక రగడనే చివరికి ఎంపిక చేశాం. బిందాస్ సినిమా చూసి వీరుపోట్ల దర్శకత్వంలో ఈ చిత్రాన్ని చేస్తున్నాను. చాలాకాలం తర్వాత హలోబ్రదర్, అల్లరి అల్లుడు వంటి వినోదాత్మక చిత్రాల తరహా చేయాలని దానికి యాక్షన్ జోడించి చిత్రాన్ని చేస్తున్నాను. దీనికి రొమాన్స్ కూడా జతకలిపారు. దర్శకుడు సినిమా గురించే ఆలోచించే వ్యక్తి అనీ, ఆయనకు మంచి భవిష్యత్ ఉందని పేర్కొన్నారు. నిర్మాత గురించి చెపుతూ.. డి. శివప్రసాద్ రెడ్డి మాస్ ఎంటర్‌టైన్మెంట్ చిత్రాలకే ప్రాధాన్యతనిస్తారనీ, ఆయన మంచి స్నేహితుడని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ... రగడ అంటేనే ఫైట్స్ అని అర్థం. కానీ కేవలం మాస్ ఎలిమెంట్సే కాకుండా కామెడీ, ఎమోషన్స్ అన్ని అంశాలు కలగలిపిన చిత్రమిది. డిసెంబరులో వస్తోన్న రగడను అందరూ ఆదరిస్తారనే నమ్మకాన్ని వెలిబుచ్చారు. ఇంకా ఈ కార్యక్రమలో బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, మాస్టర్ భరత్, అనుష్క, ప్రియమణి, ఎ.ఎస్ ప్రకాష్ పాల్గొన్నారు. కెమేరా: సర్వేస్ మురారి, ఫైట్స్: విజయ్, సంగీతం: తమన్ ఎస్. సహనిర్మాత: విశ్వచంద్రరెడ్డి.

 ----------------------------------------------------------------------