-మున్సిపల్ కమిషన్ కోరిన తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు
జగ్గయ్యపేట, చైతన్య వారిధి: పట్టణంలో అక్రమ కట్టడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని వాటిని నియంత్రించాలని తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు శుక్రవారం మున్సిపల్ కమిషనర్ శివ కోటేశ్వరావు కలిసి వినతి పత్రం అందజేశారు. అక్రమ నిర్మాణాలు చేసేదే ఎవరు? వాటికి అడ్డుకట్ట వేయాల్సింది ఎవరు అంటూ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు కమిషనర్ ను నిల దీశారు.జగ్గయ్యపేట ఆర్టీసీ అవరణలో ఇన్ ఔట్ గేట్ వద్ద గత మూడు రోజులుగా జరుగుతున్న అక్రమ నిర్మాణ పనులు గురించి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది, ఈ సందర్భంలో కౌన్సిల్ సభ్యులు మాట్లాడుతూ బస్టాండ్ ఆవరణలో ఉన్నటువంటి స్థలాన్ని ఎవరికి కేటాయించారు, ఎంత కేటాయించారు, ఏ పనుల కోసం కేటాయించడం జరిగినది, పనులు ఎవరు చేయిస్తున్నారు, ఏ ప్రాతిపదికన స్థలం కేటాయించడం జరిగినది, అనుమతులు ఏవిధంగా ఇచ్చినారు, జరుగుతున్న పనులు ఎంత ఖర్చు చేసి చేస్తున్నారు ఆ మొత్తం ఖర్చు ఏ డిపార్ట్మెంట్ నుండి మంజూరు చేయడం జరిగినది,స్థలాన్ని ఉచితముగా ఏమైనా కేటాయించారా? అని తదితర అంశాలు మున్సిపల్ కమిషనర్ వారిని కోరగా వారి వద్ద సరైన సమాధానం చెప్పకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్టీసీ డిఎం ని అడగగా వారు మున్సిపల్ వారికి ఇవ్వడం జరిగిందని చెబుతున్నారని, ఈ విధంగా ప్రభుత్వ స్థలాన్ని ఎటువంటి అనుమతులు లేకుండా ఏ శాఖ అయినా ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. త్వరితగతిన అధికారులు స్పందించి ఆ కట్టుబడి కి సంబంధించిన పూర్తి వివరాలు తెలపి ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మేక వెంకటేశ్వర్లు, మైనేని రాధాకృష్ణ, కౌన్సిలర్లు , పేరం సైదేశ్వరరావు, నకిరికంటి వెంకటి, గొట్టే నాగరాజు మరియు నాయకులు సూర్యదేవర రాంప్రసాద్, గెల్లా. వైకుంఠేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి