విశాఖపట్నం: పాతనగరం బురుజుపేటలో వెలిసిన కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి హుండీల ద్వారా రూ.58,56,405 ఆదాయం లభించింది. గత నెల 20 నుంచి ఈనెల 10 వరకు వచ్చిన ఆదాయాన్ని సోమవారం ఆలయ ఆవరణలో లెక్కించారు. బంగారం 142.127 గ్రాములు, వెండి 1.700 కిలోగ్రాములు, అమెరికా డాలర్లు 32, యుఏఈ సెంట్రల్ బ్యాంకు దిర్హామ్స్ 15 లభించాయి. ఆలయ ఈఓ ఎస్‌జె మాధవి, ఏఈఓలు వి.రాంబాబు, పి. రామారావు, పర్యవేక్షకులు అప్పలనర్సింహరాజు, త్రిమూర్తులు, ఉమా నీలకంఠేశ్వరస్వామి ఆలయ ఈఓ జగన్నాథరావు, తనిఖీ అధికారి నర్సింగరావు, ధర్మకర్తలి మండలి ఛైర్‌పర్సన్ కొల్లి సింహాచలం, తదితరులు పాల్గొన్నారు.
Loading...
11, జనవరి 2022, మంగళవారం
కనకమహాలక్ష్మి హుండీ ఆదాయం రూ.58.56 లక్షలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి