Loading...

1, జులై 2020, బుధవారం

ఘనంగా విజయసాయిరెడ్డి జన్మదిన వేడుకలు

గాజువాక, చైతన్యవారధి:
జీవీఎంసీ 65 వ వార్డు పరిధిలో గల కాకతీయ జంక్షన్ వధ్ద గల స్వర్గీయ డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద  జిల్లా వైఎస్సార్ సీపీ మహిళా నాయకురాలు,  వెంబో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షురాలు  మంత్రి మంజుల నేతృత్వంలో రాజ్యసభ సభ్యులు డాక్టర్ విజయ సాయి రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు 74 వ వార్డు వైఎస్సార్ సీపీ అభ్యర్థి తిప్పల వంశీ రెడ్డి, 76 వార్డు వైఎస్సార్ సీపీ అభ్యర్థి దొడ్డి రమణ, 66 వార్డు వైఎస్సార్ సీపీ అభ్యర్థి మహమ్మద్ ఇమ్రాన్ హాజరయ్యారు. వార్డు నాయకులతో కలిసి కేక్ కట్ చేసి విజయసాయి రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సంధర్భంగా  పేద వారికి పండ్లు పంపిణీ చేశారు. అనంతరం వంశీ రెడ్డి  మాట్లాడుతూ  రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి మాటే తన బాటగా నిలుస్తూ పార్టీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని, అందరితో సుపరిచితులు గా ఉంటూ ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా నేనున్నా  అంటూ ముందుకు వచ్చే నాయకుడు  విజయసాయి రెడ్డి ఒక్కరేనని అని అన్నారు. అలాగే గాజువాక నియోజకవర్గ శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి తరుపున అలాగే నియోజకవర్గ  ప్రజల తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  మర్టుపూడి పరదేశి,సమ్మీడి ఆనంద్, ఓల్లేటి నూకరాజు  తుంపాల తాత రావు, పిట్టా రెడ్డి, ఎన్.ఎస్.ఎన్. రెడ్డి, పాల అప్పల రెడ్డి,  బొత్స వాసు,  ఇళ్ళ శివ, శాంతి, పుష్ప , రమణమ్మ, పద్మ, చౌడువాడ  చిన్న, గణేష్ (సీలింగ్),శివ, గణేష్,  తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి