- జగన్ వ్యాఖ్యలపై నాగబాబు రియాక్షన్
పవన్ కు ఎవరినీ మోసగించటం చేతకాదని పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు అన్నారు. పవన్ పై జగన్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఆయన రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైవాహిక జీవితంలోనూ పవన్ ఎవరికీ అన్యాయం చేయలేదన్నారు. ఇద్దరు భార్యల నుంచి విడాకులు తీసుకోవటానికి కారణాలు ఏమిటన్నది భార్యభర్తల మధ్య జరిగిన విషయమని.. పవన్ చట్టబద్ధంగానే విడాకులు తీసుకున్నారని.. అందులో ఎలాంటి వివాదం లేదన్నారు. పవన్ మొదటి భార్య కానీ.. రెండో భార్య రేణూ కానీ ఎక్కడా పవన్ గురించి తప్పుగా మాట్లాడిన సందర్భాలు లేవని నాగబాబు చెప్పారు.
చట్టబద్ధంగా విడిపోయి.. న్యాయంగా బతుకుతున్న వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారో తనకు అర్థం కావటం లేదన్న నాగబాబు.. పెళ్లిళ్లు చేసుకొని అక్రమ సంబంధాలు నడిపితే తప్పు లేదా? అని ప్రశ్నించారు. పవన్ ను విమర్శించటం వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు. జగన్ చేసిన వ్యాఖ్యల్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పవన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాల్ని ప్రస్తావించటం జగన్ స్థాయికి తగిన వ్యాఖ్యలు కావన్నారు. పార్టీ అధ్యక్షుడిగా నోరు జారకూడదని.. తొందరపాటులో ఎలా పడితే అలా మాట్లాడకూడదన్నారు. పవన్ విహానానికి సంబంధించి సరైన అవగాహన లేకుండా జగన్ మాట్లాడారని నాగబాబు వ్యాఖ్యానించారు. జగన్ అభద్రతా భావంతో ఉన్నారని.. అందుకే ఆయన అలా మాట్లాడి ఉండొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరి.. నాగబాబు వ్యాఖ్యలకు జగన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
రాజకీయాల్లో సవాలచ్చ ఉండొచ్చు కానీ.. అవేమీ హద్దులు దాటకూడదు. మొండితనం.. అంతకు మించిన పెంకితనం ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎక్కువన్న విమర్శ ఉంది. ఆయన ఎవరి మాట వినరని.. తనకు తోచింది చేస్తారని.. దూకుడుగా వ్యవహరిస్తారని.. దుందుడుకు స్వభావం ఎక్కువన్న ఆరోపణలు ఉన్నాయి.
సాధారణంగా ఏదైనా రాజకీయ పార్టీ నుంచి నేతలు వీడిపోవటానికి కారణం.. వారు కోరుకున్న పదవులు.. ప్రయారిటీ ఇవ్వకపోవటంగా ఉంటుంది. కానీ.. జగన్ పార్టీ నుంచి నేతలు మారిపోవటం వెనుక.. ఆయన వైఖరి.. ఆయన బిహేవియర్ ను తట్టుకోలేక వెళ్లిపోతున్నట్లుగా పలువురు నేతలు గతంలో చెప్పటాన్ని పలువురు గుర్తు చేస్తుంటారు. జగన్ కు అటిట్యూడ్ ఎక్కువని.. అదే ఆయన్ను ఇబ్బంది పెడుతోందన్న ఆవేదనను జగన్ పార్టీ నేతలు తరచూ వ్యక్తం చేయటం పొలిటిక్ బీట్స్ చూసే మీడియా మిత్రులకు బాగా తెలిసిన విషయమే.
ఏమైందో ఏమో కానీ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం సంచలనం సృష్టించింది. పాదయాత్ర చేస్తున్నా ఆశించినంత మైలేజీ రాకపోవటం.. పవన్ పర్యటనలు తన పాదయాత్రను మరుగన పడేలా చేస్తున్నాయన్న అభ్రదతా భావమే జగన్ చేత అనకూడని మాటల్ని అనేలా చేసిందన్న వాదన ఉంది.
కార్లను మార్చినట్లుగా పవన్ పెళ్లాల్ని మారుస్తారని మండిపడ్డ వ్యాఖ్య దారుణమన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకుంటే.. జగన్ మాత్రం నాలుగు పెళ్లిళ్లు అని వ్యాఖ్యానించాటాన్ని తప్పు పడుతున్నారు. పవన్‌పై వ్యక్తిగత విమర్శలు చేయటం సరికాదన్న వాదనను పలువురు వినిపిస్తున్నారు. వ్యూహాత్మకంగానూ.. రాజకీయంగానూ పవన్ విషయంలో జగన్ చేయకూడని తప్పు చేసినట్లుగా పలువురు విశ్లేషిస్తున్న పరిస్థితి.
Nice, thank u for sharing...
రిప్లయితొలగించండిhttps://www.ins.media