Loading...

9, నవంబర్ 2018, శుక్రవారం

అనుమతులు రద్దు చేయండి



- ప్రత్యేక అధికారిని కోరిన భరణికం గ్రామస్తులు
పరవాడ, చైతన్యవారధి: మండలంలో భరణికం పంచాయితీ పరిధిలో నిర్మిస్తున్న అమ్మోనియా గ్యాస్ కంపెనీ కి అనుమతులు రద్దు చేయమని ప్రత్యేక అధికారికి గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు.  గ్రామంలో శుక్రవారం నిర్వహించిన గ్రామ సభలో అమ్మోనియా గ్యాస్ కంపెనీకి వ్యతిరేకంగా గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. అమ్మోనియం గ్యాస్ కంపెనీ నుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామంలో సంతకాల సేకరణ చేయడం జరిగింది.
ఈ విధంగా సంతకాల సేకరణ చేసిన ఫిర్యాదు పత్రాన్ని గ్రామ సభలో ప్రత్యేక అధికారి కి గ్రామస్తులు అందజేయడం జరిగింది. సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ప్రత్యేక అధికారి గ్రామస్తులకు హామీ ఇవ్వడం జరిగింది. ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండా ఏకపక్షంగా హానికరమైన గ్యాస్ కంపెనీ మా గ్రామం నుండి తరలించాలని ముక్తకంఠంతో గ్రామస్తులు ప్రత్యేక అధికారిని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బొండా తాతారావు, బొండా సన్నిదేముడు, పెదిశెట్టి శేఖర్, కొరుకొండ శ్రీనివాసరావు, పెదిశెట్టి సత్యారావు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి