తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషత్ శతవసంతాల వేడుకలు వైభవంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ,హోంశాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. జిల్లా ప్రజా పరిషత్ శత వసంతాల వేడుకల సందర్భంగా జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద జిల్లా పరిషత్ శత జయంతి వేడుకల జెండాను ఉపముఖ్యమంత్రి చినరాజప్ప ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ , జిల్లా కలక్టర్ కార్తికేయ మిశ్రా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లా పరిషత్ 1917 సంవత్సరంలో ఏర్పడిందని, అంతకు ముందు జిల్లా పరిషత్ బోర్డుగా ఉండేదన్నారు. మే నెలలో జిల్లా ప్రజాపరిషత్ శత వసంతాల వేడుకలు ఘనంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ వేడుకలను మే నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందన్నారు. తూర్పు గోదావరి జిల్లా పరిషత్ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లా పరిషత్ అధ్యక్షులుగా సేవలందించిన ప్రముఖులను ఘనంగా సత్కరించడం జరుగుతుందన్నారు. జిల్లా పరిషత్ అధ్యక్షులుగా మల్లిపుడి పల్లంరాజు , తోట రామస్వామి, జిఎంసి బాలయోగి వంటి అనేక మంది జి ల్లా వాసులు పని చేసి జిల్లాను అభివృధ్ధి పధంలో నడిపారన్నారు. స్వర్గీయ జియంసి బాలయోగి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ అధ్యక్షులుగా పదవి చేపట్టి, అనంతరం లోక్‌సభ స్పీకరుగా ఎదిగారన్నారు. 1987వ సంవత్సరం నుండి తాను జిల్లా పరిషత్ బోర్డు సభ్యులుగా ఉన్నానని, నాటి నుండి స్ధానిక సంస్ధలలో జిల్లా అభివృధ్ధి కి కృషి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా పరిషత్ ద్వారా గ్రామీణ ప్రాంతాలలో సిసి రోడ్లు, పాఠశాల భవనాలు, మంచినీటి సరఫరా, వంటి అనేక అభివృధ్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. స్వర్గీయ ఎన్.టి.రామారావు, జిల్లా ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో మండలాల వ్యవస్ధ ఏర్పాటు, మండల ప్రజా పరిషత్‌ల ద్వారా గ్రామీణ ప్రాంతాలలో అభివృధ్ధికి శ్రీకారం చుట్టారన్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మారుమూల గ్రామాలలో సిమ్మెంటు రోడ్లు, మంచినీటి ట్యాంకులు, పాఠశాలలు, అంగన్‌వాడీ భవనాలు, పంచాయతీ కార్యాలయ భవనాలు వంటి అనేక అభివృధ్ధి కార్యక్రమాలు చేపట్టి స్ధానిక సంస్ధలను బలోపేతం చేస్తున్నారన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాష్ట్రానికి ఒక స్వర్ణయుగంగా అభివర్ణించారు. ఈ శత వసంతాల వేడుకల సందర్భంగా కాకినాడ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద స్వర్గీయ ఎన్.టి.రామారావు కాంస్య విగ్రహాన్ని అలాగే స్ధూపాన్ని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఉపముఖ్యమంత్రి చినరాజప్ప తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఛైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్ మాట్లాడుతూ ఈ శత వసంతాల వేడుకలలో భాగంగా ఈ నెల 17వ తేదీన జిల్లాలోని అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ నందు స్ధానిక శాసన సభ్యులు స్టిక్కర్లు, ఆహ్వాన పత్రం, వాల్‌పోస్టర్, జెండా ఆవిష్కరణ చేస్తారని, అలాగే అన్ని మండల ప్రజా పరిషత్ కార్యాలయాలలో ఎంపిపిలచే జిల్లా పరిషత్ హైస్కూల్ నందు జడ్‌పిటిసి లచే జెండా ఆవిష్కరణచేస్తారని, అలాగే గ్రామ పంచాయతీల యందు గ్రామ సర్పంచ్‌లచే జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతోందన్నారు. 18వ తేదీన మండల కేంద్రాలలో ఎంఇఓల ఆధ్వర్యంలో హైస్కూలుహెచ్‌ఎం, ఉపాధ్యాయులు, విద్యార్ధులతో కలిసి ర్యాలీ నిర్వహిస్తారన్నారు. ఉపాధ్యాయుల స్పోర్ట్స్,గేమ్స్,ఉపన్యాసపోటీలు , ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఇఓ ఆర్.గోవిందరావు, గోకాడ రాంబాబు, బి.సత్తిబాబు, జడ్‌పిటిసీ,ఎంపిటిసి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పరిషత్ ఛైర్మన్ కు సత్కారం: జిల్లా పరిషత్ ఛైర్మన్ జ్యోతుల నవీన్‌కుమార్ పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం జడ్‌పి ఛైర్మన్ ఛాంబర్‌లో ఆయనను ఘనంగా సత్కరించారు. రాష్ట్ర ఉపముఖ్యమం త్రి చినరాజప్ప,జిల్లా కలక్టర్ కార్తికేయ మిశ్రా జిల్లా పరిషత్ ఛైర్మన్ నవీన్ కుమార్‌తో పుట్టిన రోజు కేక్‌ను కట్ చేయించి, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, జెడ్.పి.టిసి, ఎమ్.పి.టిసి సభ్యులు హాజరయి జిల్లా పరిషత్ ఛైర్మన్‌నవీన్‌కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి