- సామాన్య భక్తులకు సకల సౌకర్యాలు
మంత్రి గంటా శ్రీనివాసరావు
విశాఖపట్నం, ఏప్రిల్ 17(చైతన్యవారధి): స్వామి నిజరూప దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులందరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు కల్పించడం జరిగిందని రాష్ట్ర మానవవనరుల శాఖా మాత్యులు గంటా శ్రీనివాసరావు వివరించారు. మంగళవారం మంత్రి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు రామచంద్ర మోహన్ తో కలిసి గుడి ప్రాంగణం అంతా తిరిగి పరిశీలించి ఏర్పాట్ల పై సంతృప్తి వ్యక్తం చేశారు.
తదుపరి మంత్రి తనను కలిసిన పాత్రికేయులతో మాట్లాడుతూ స్వామి నిజరూపదర్శనానికి భక్త కోటికి చేసిన ఏర్పాట్లును వివరించారు. ఈ సందర్భముగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నుండే గాక చుట్టు ప్రక్కల రాష్ట్రాల నుండి కూడా స్వామి నిజరూపదర్శన బాగ్యం కోసం విశేషంగా భక్తులు తరలి వస్తారన్నారు. కుటుంబాలతో కలిసి వచ్చి దర్శనం చేసుకుంటారని వారందరకు ఎటువంటి యిబ్బందులు ఎదురవ కుండా చలువ పందిళ్లు నిరంతరముగా మంచి నీరు, మజ్జిగ అందించే ఏర్పాట్లు చేశామన్నారు. సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రోటోకాల్ మరియు వి వి ఐ పి ల దర్శన సమయాలను నియంత్రించామన్నారు. క్యూలైన్లలో భక్తులకు ఎండ తగల కుండా పందిళ్లు ఏర్పాటు, శానిటేషన్, అందుబాటులో ఆరోగ్య సిబ్బంది ఫైర్ సిబ్బంది ఉంటారన్నారు. అధికారులు, సిబ్బంది అంతా సమన్వయంతో పని చేస్తున్నారన్నారు. వాలంటీర్లు కూడా సేవలందిస్తారన్నారు. ప్రోటో కాల్ దర్శనాలు ఉదయం 5 నుండి 6 వరకు మరియు వివిఐపి దర్శనాలు 8-9 మరియు 2-3 వరకు ఉంటాయన్నారు. ఈ సమయాలకు అనుగుణంగా వివిఐపిలు, భక్తులు సహకరించాలని కోరారు. అదే విదముగా గర్భిణీలకు ప్రత్యేక ఏర్పాట్లు చేడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలోసింహాచలం ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, గంట్ల శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి