Loading...

20, మే 2017, శనివారం

గృహలకు సంబందించి పూర్తి నివేదిక అందజేయాలి

విశాఖపట్నం, చైతన్యవారధి:
ఎన్టీ ఆర్‌ గృహ నిర్మాణాలకు సంబందించి ఈ నెల 24వ తేది లోపల పూర్తి నివేదికను  అందజేయాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌  కుమార్‌ ఆ శాఖ అధికారులను ఆదేశించారు.  కలెక్టర్‌ కార్యాలయ సమావేశమందిరంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో  సమీక్షించారు.  ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నిర్దేశించిన లక్ష్యాల మేరకు గృహ నిర్మాణాలను వేగవంతంగా  చేపట్టి జిల్లాను  మొదటి స్థానంలో  నిలిపేందుకు కృషి  చేయాలన్నారు.  ఇంటింటికి సర్వే  చేపట్టి అర్హులైన లబ్దిదారుల  లిస్టును
తయారు  చేయాలన్నారు.  డేటా ఎంట్రీ ఆపరేటర్లు జాగ్రత్తగా  ఆన్‌ లైన్‌ ద్వారా డేటా కలెక్షన్‌  చేసి అప్‌ డేట్‌  చేయాలన్నారు.  2017-18, 2018-19 ఎన్టీ ఆర్‌ గృహనిర్మాణాలకు సంబందించి లబ్దిదారులను గుర్తించడానికి  సంబందిత నియోజక వర్గ ఎం ఎల్‌ ఎ ల సమన్వయంతో  మండల,గ్రామాల వారిగా  అర్హులను ఎంపిక చేయాలన్నారు. గృహ నిర్మాణ శాఖ పి డి ప్రసాద్‌  మాట్లాడుతూ జిల్లాలో ఎన్టీ ఆర్‌ పథకం 2016-17 సంవత్సరంలో నియోజకవర్గాల వారిగా మొత్తం  12,950 గృహాలను కేటాయించడం జరిగిందని అందులో 12,413 గృహాలు మంజూరయ్యాయన్నారు.  8439 గృహాల నిర్మాణం ప్రారంభించడం జరిగిందన్నారు. కేంద్ర, ప్రభుత్వ గ్రామీణ గృహనిర్మాణ పథకం  కింద గ్రామాలలో సర్వే  చేసి  లబ్దిదారుల జాబితాను  తయారు  చేయవలసి ఉందన్నారు. మంజూరైన గృహాలలో ఎస్‌ సి, ఎస్‌ టి, మైనార్టి ఇతరలు,  వికలాంగులకు నిర్దేశించిన ప్రకారం  కేటాయించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో  జాయింట్‌ కలెక్టర్‌ జి.సృజన,  గృహ నిర్మాణ శాఖ ఇ ఇ రవికుమార్‌, డి ఇ లు, ఎ .ఇ లు , డేటా ఎంట్రీ ఆపరేటర్లు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి