Loading...

20, మే 2017, శనివారం

కౌమార దశ బాల బాలికల ఆరోగ్య సమస్యలపై దృష్టి పెట్టండి

విశాఖపట్నం, చైతన్యవారధి:
పాఠశాలలలో బాలబాలికల  కౌమార దశల ఆరోగ్య సమస్యలపై దృష్టి పెట్టాల్సిందిగా  జిల్లా కలెక్టర్‌  ప్రవీణ్‌ కుమార్‌ సంబందిత అధికారులను  ఆదేశించారు.  కలెక్టర్‌ కార్యాలయ సమావేశమందిరంలో రాష్ట్రీయ కిశోర్‌ స్వాస్త్య కార్యక్రమం  లో భాగంగా  యునిసెఫ్‌ సహకారంతో యూత్‌ ఫర్‌ సేవ సంస్థ   ఏర్పాటు  చేసిన  కార్యక్రమంలో  కలెక్టర్‌  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ  ప్రభుత్వ ,సంక్షేమ  పాఠశాలలలో మరుగుదొడ్లు, నిరంతర నీటి సదుపాయం, ప్రహరీ గోడలు  లేని వాటినిగుర్తించి  ఒక నివేదికను  తయారు  చేయాలన్నారు.  ఏజెన్సీ ప్రాంత మండలాలలో రక్తహీనతతో
 బాదపడుతున్న బాల బాలికలను గుర్తించాలన్నారు.  చిరుధాన్యాలను వినియోగించి  మంచి పౌష్టికాహారం అందే విదంగా చూడాలన్నారు.  తరుచుగా డాక్టర్లు పాఠశాలలు, హాస్టల్స్‌ ను సందర్శించి పిల్లలకు  వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు.  కౌమార దశలో వచ్చే మార్పులను గురించి పిల్లలకు తెలియజేయడం,  వ్యక్తిగతపరిశుభ్రత పై అవగాహన కలిగించాలన్నారు. యునిసెఫ్‌ ప్రతినిధి డాక్టర్‌ మీనాసోమ్‌ మాట్లాడుతూ కౌమార  బాల బాలికల  సంక్షేమం కోసం కేంద్రప్రభుత్వం  చేపట్టిన  ఆర్‌ కె  ఎస్‌  కె పథకంలో  బాగంగా  యూత్‌ ఫర్‌ సేవా సహకారంతో  పైలెట్‌ ప్రాజెక్టును 6 నెలల నుండి  ప్రభుత్వ పాఠశాలలో డేటాను పొందుపర్చడం జరుగుతుందన్నారు. ఆయా పాఠశాలలో మౌళిక వసతుల వివరాలను సేకరించడం అయ్యిందన్నారు.  జిల్లాలో ఐ టిడి ఎ , సర్వశిక్ష అభియాన్‌, విద్య , వైద్య ఆరోగ్య శాఖలకు సంబందించి  298 పాఠశాలలో  95,858మంది కౌమార  బాలబాలికలను గుర్తించడం జరిగిందన్నారు. పాఠశాలలకు జియో ట్యాగంగ్‌  చేయడం జరిగిందని,  పాఠశాలలకు దగ్గరి లోగల ఆసుపత్రులకు అనుసంధానం  చేయడం జరుగుతుందన్నారు. ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు  చేసి పిల్లలకు వైద్య పరీక్షలను నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ  చేయడం జరుగుతుందన్నారు. జూన్‌ నుండి 2వ దశ  సర్వే  చేయనున్నామన్నారు.  పూర్తి వివరాలతో కూడిన నివేదికను కేంద్ర ప్రభుత్వ దృష్టికితీసుకు వెళ్లడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో   జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ ఉమా సుందరి, జెడి డా.వసంతకుమారి, యునిసెఫ్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ సునంద, డి ఇ ఒ నాగమణి, సర్వశిక్ష అభియాన్‌  పి.ఓ శివప్రసాద్‌,   ట్రైబల్‌ వెల్పేరు డిడి కమలకుమారి , యునిసెఫ్‌ ప్రతినిధులు సంతోష్‌  కుమార్‌, ఉమా శంకర్‌,జితేంద్ర, ఉదయ శంకర్‌ రాజు, వెంకన్న బాబ్జి తదితరులు పాల్గొన్నారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి