Loading...

20, మే 2017, శనివారం

భూముల కేటాయింపు పనులు వేగవంతం చేయాలి

- జిల్లా కలెక్టర్‌ప్రవీణ్‌ కుమార్‌

విశాఖపట్నం, చైతన్యవారధి:
పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూములను కేటాయించేందుకు 4 వేల 68 ఎకరాల ఎసైన్డు, ప్రభుత్వ భూముల ఎలియనేషన్‌ పనులను వేగవంతం  చేయాలని రెవిన్యూ, ఏ.పి.ఐ.ఐ.సి. అధికారులను జిల్లా కలెక్టర్‌ప్రవీణ్‌ కుమార్‌ ఆదేశించారు. తన చాంబరులో ఏ.పి.ఐ.ఐ.సి., రెవిన్యూ అధికారులతో కలెక్టర్‌ సమావేశమై భూముల ఎలియనేషన్‌ పనుల ప్రగతిని సమీక్షించారు. సబ్బవరం మండలం గాలిభీమవరం,
లాగిశెట్టిపాలెం, పైడివాడ, ఎరుకునాయుడుపాలెం, నారపాడు, ఆనందపురం మండలం పాలవలస, తరులవాడ, కనమం, గంభీరం, రామవరం, పద్మనాభం మండలం అనంతవరం, పెంట, గాజువాక మండలం అగనంపూడి, తలారివానిపాలెం, విశాఖ రూరల్‌ మధురవాడ, పెదగంట్యాడ మండలం అప్పికొండ తదితర గ్రామాల్లోని ఎసైన్డు, ప్రభుత్వ భూముల ఎలియనేషన్‌ పనుల ప్రగతిని కలెక్టర్‌ ఈ సమావేశంలో సమీక్షించారు.  ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ భాగస్వామ్య సదస్సుల్లో ఒప్పందాలు  చేసుకున్న కంపెనీలు అన్నింటికీ అవసరమైన భూములు కేటాయించే విధంగా ఏ.పి.ఐ.ఐ.సి. అధికారులు సిద్దంగా ఉండాలన్నారు. ఒప్పందాలు  చేసుకున్న వారిలో ఇప్పటి వరకూ ముందుకు వచ్చిన కంపెనీలు అన్నింటికీ భూములు కేటాయించడం జరిగిందన్నారు. అయితే మిగిలన వారికి భూములు కేటాయించేందుకు నగరానికి చుట్టుప్రక్కల గల మండలాల్లో ఇప్పటి వరకూ గుర్తించిన 4 వేల 68 ఎకరాల ఎసైన్డు, ప్రభుత్వ భూముల ఎలియనేషన్‌ పనులను సత్వరమే పూర్తి చేసి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా భూములను కేటాయించేందుకు సిద్దంగా ఉండాలని అధికారులకు ఆయన సూచించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు  చేసి పట్టాభూములు, ఎసైన్డు భూముల్లో ఎంజాయిమెంట్‌  చేసే వారి వివరాలు,  ఆక్రమణలోనున్న భూముల వివరాలను వెంటనే సేకరించి భూముల సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ భూముల ఎలియనేషకు జరుగుచున్న పనుల వివరాలతో జాబితాను రూపొందించి జాయింట్‌ కలెక్టర్‌ జి.సృజనకు అందజేయాలని అధికారులకు ఆయన సూచించారు. ఇకపై ప్రతివారం ఎలియనేషన్‌ పనుల ప్రగతిని సమీక్షించాలని జాయింట్‌ కలెక్టర్‌కు కలెక్టర్‌ సూచించారు.  జాయింట్‌ కలెక్టర్‌ జి.సృజన, ఏ.పి.ఐ.ఐ.సి. ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మహేశ్వరరెడ్డి, జోనల్‌ మేనేజర్‌ యతిరాజులు, డిప్యుటీ జడ్‌.ఎం. పార్థసారధి, మేనేజర్‌ హరనాద్‌, ఎస్‌.డి.సి.లు సత్తిబాబు, రమణ, కలెక్టరేట్‌ జి-సెక్షన్‌ మూర్తి తదితరులు  ఈ సమావేశంలో పాల్గన్నారు. పర్యాటక శాఖ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బి.శ్రీరాములు నాయుడు, జిల్లా పర్యాటక శాఖ అధికారి జ్ఞానవేణి, జిల్లా పర్యాటక కౌన్సిల్‌ సభ్యులు సోహన్‌ హట్టంగి, బి.ఆర్‌.విక్రమ కుమార్‌, మహేశ్వరదాసు, అటవీ అధికారి రామ్‌ నరేష్‌ తదితరులు  ఈ సమావేశంలో పాల్గన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి