Loading...

20, మే 2017, శనివారం

మంగమారింపేట బీచ్‌లో రూ.2 కోట్లతో వాటర్‌ స్ట్పోర్ట్సు హబ్‌

- జిల్లా కలెక్టర్‌ప్రవీణ్‌ కుమార్‌

విశాఖపట్నం, చైతన్యవారధి:
మంగమారింపేట బీచ్‌లో రూ.2 కోట్లతో వాటర్‌ స్ట్పోర్ట్సు హబ్‌ అభివృద్దికి అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించేందుకు వెంటనే ఒక ఆర్టిటెక్టు ఏజన్సీని నియమించాలని జిల్లా కలెక్టర్‌ప్రవీణ్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ అద్యక్షతన జిల్లా టూరిజమ్‌ కౌన్సిల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మంగమారింపేట బీచ్‌లో  వాటర్‌ స్పోర్ట్సుకు అవసరమైన జట్టీ, ల్యాండ్‌
స్కేపింగ్‌, ఎప్రోచ్‌ రోడ్డు, రెస్టారెంట్‌, ఇతర సౌకర్యాల కల్పనకు సాద్యమైనంత త్వరగా సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. చినవాల్తేరులో సుమారు పర్యాటక భవనం నిర్మాణానికి ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలు త్వరలో కార్యరూపం దాల్చనున్నాయని, అందుకు అనుగుణంగా భవన నిర్మాణానికి అవసరమై ఏర్పాట్లు  చేయాలని అధికారులను కలెక్ట్‌ర్‌ ఆదేశించారు.  కురుసుర సబ్‌మెరైన్‌ ఎదురుగా ఆంద్రా విశ్వవిద్యాలయం స్థలంలో  టి.యు.-142 ఎయిర్‌ క్రాప్టు మ్యూజియం ఏర్పాటు స్థల సేకరణ వెంటనే జరిగేలా చర్యలు  చపట్టాలన్నారు. మధురవాడలో పర్యాటక శాఖకు అప్పగించిన 240 ఎకరాల స్థలంలో పలు పర్యాటక ప్రాజక్టులు ఏర్పాటు చేసేందుక వీలుగా లే-అవుట్‌ను అభివృపర్చాలన్నారు. కొండకర్ల ఆవ, లంబసింగి, దాలపల్లి తదితర ప్రాంతాల్లో రూ.10 కోట్ల అంచనావ్యయంతో  పర్యాటక సౌకర్యాల కల్పనకు ప్రతిపాదించిన పనులను వేగవంతం  చేయాలని అధికారులకు ఆయన సూచించారు. మల్లియగుడ నుండి బొర్రాగుహలు వెళ్లే మార్గంలో బ్రిడ్జి నిర్మాణానికి, అనంతగిరి నుండి తడిగుడ వాటర్‌ ఫాల్స్‌కు వెళ్లే రహదాని విస్తరణకు అవసరమైన నిధులను ఐ.టి.డి.ఏ. నుండి పొందేందుకు ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. బొర్రాగుహలకు వెళ్లెమార్గంలో లైటింగ్‌ సౌకర్యాన్ని కల్పించేందుకు  ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. తాండవ రిజర్వాయరు, సరుగుడు వాటర్‌ ఫాల్స్‌ ప్రాంతాల్లో పర్యాటక సౌకర్యాల అభివృద్దికై పరిపాలనా అనుమతికై ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి