Loading...

1, ఏప్రిల్ 2017, శనివారం

విశాఖ ఉక్కునిర్వాసితుల అఖిలపక్షసమావేశం విజయవంతం..

గాజువాక.చైతన్యవారధి : విశాఖ ఉక్కునిర్వాసితుల పలుసమస్యలు పై శుక్రవారం ఉదయం గాజువాక హౌసింగ్ బోర్డు సి డబ్ల్యూ సి నందు  అఖిలపక్ష నాయుకులు మరియు నియోజకవర్గ పలువురు పార్టీ నాయుకులు ఆద్వర్యంలో  సమావేశం జరిగింది, ఈ  సమావేశంలో పలుసూచనలు, సలహాలు ,వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చులు జరిగాయి, ఈ సమావేశంలో  గాజువాక ప్రపధమ మాజీ శాసన సభ్యులు చింతలపూడి వెంకట్రామయ్య మాట్లాడుతూ శాసన సభ్యులుగా ఉన్నప్పుడు నిర్వాసితులకు చేసిన సహాయ సహకారాలు గురించి వివరించారు, అనంతరం భవిష్యత్తులో కూడా ఉక్కునిర్వాసితులకు అండగా ఉండి వారు చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని  సంపూర్ణ సహకారాలు ఆనందిస్తానని అన్నారు, అనంతరం సోమవారం ఉదయం స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ ని  కలవాలని అఖిలపక్షం తీర్మానం చేసింది, ఈ కార్యక్రమానికి  మాజీ శాసన సభ్యులు తిప్పల గురుమూర్తి రెడ్డి , వై యస్ ఆర్ సి పి సమన్వయకర్త  తిప్పల నాగిరెడ్డి, మస్తానప్ప,పరందమయ్య ,పట్టా రామా అప్పారావు,పులి రమణరెడ్డి ,ధామ్మేట అప్పారావు, జనసేనపార్టీ నాయుకులు,ఆమ్ఆద్మీ నాయుకులు,ఉక్కునిర్వాసితుల ఐఖ్య సంఘ మరియు ఉక్కులేబర్ యూనియన్ ఆద్వర్యంలో నిర్వహించారు, ఈ కార్యక్రమంలో  నిర్వాసితుల అధిక సంఖ్యలో జయప్రదం చేసారు,  బొంతు అప్పారావు,భాస్కరరావు,ఉమ్మడి అప్పారావు,దుగ్గపు అప్పలరాజు,రామిరెడ్డి,వరహాలరెడ్డి ,ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి