గాజువాక, చైతన్యవారధి: స్టీల్‌ప్లాంట్‌కు సొంతగనులు కేటాయించాలని చెప్పిన హైకోర్టు ఉత్తర్వుల అమలుకు కృషి చేస్తామని స్టీల్ ప్రోగ్రెసివ్ ఫ్రంట్, విశాఖ స్టీల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి.ఆదినారాయణ, ఎన్.రామారావు తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌లోని ఎఫ్‌ఎండి, ఫౌండ్రీ, సిఆర్‌ఎంపి తదితర విభాగాల్లో గురువారం ప్రోగ్రెసివ్ ఫ్రంట్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఫ్రంట్ ప్రధాన కార్యదర్శి రామారావు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న ఇనుపగనులను వైఎస్ రాజశేఖరరెడ్డి తన సొంత మనిషైన గాలి జనార్ధనరెడ్డికి కేటాయించారు కానీ ఎంతో మందికి ఉపాధి చూపిస్తున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేటాయించలేదని విమర్శించారు. ఈ గనులను విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేటాయించాలని హైకోర్టును ఆశ్రయించామని, దీనికి స్పందించిన హైకోర్టు విశాఖ ఉక్కుకు గనులు కేటాయించాలని తీర్పు ఇచ్చిందని చెప్పారు. ఆ తీర్పును ఆధారం చేసుకున్న అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బయ్యారం గనులు లీజ్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. కోర్టు తీర్పు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసి స్టీల్ ప్లాంట్‌కు సొంతగనుల సాధనకోసం కృషి చేస్తామని చెప్పారు. ఫిబ్రవరి 14వ తేదీన జరగనున్న ఎన్నికల్లో గంట గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఫ్రంట్ అధ్యక్షులు డి.ఆదినారాయణ మాట్లాడుతూ, రాష్ట్రంలో గనులు విశాఖ ఉక్కుకు కేటాయించాలని గడిచిన గుర్తింపు కాలంలో హైదరాబాద్‌లో, ఢిల్లీలో పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. దీనికి స్పందించిన ప్రభుత్వాలు ఉత్తర్వులు తీసుకునే సమయానికి రాష్ట్ర విభజన, ఎన్నికలు తదితర అంశాలతో అది వెనుకకు వెళ్లిందని వివరించారు. హైకోర్టు ఉత్తర్వుల అమల కోసం ఫ్రంట్ కృషి చేస్తుందని, దీనికి స్టీల్ కార్మికులు అత్యధికంగా మద్దతు ప్రకటించాలని కోరారు. ఈ సమావేశంలో స్టీల్ ప్రోగ్రెసివ్ ఫ్రంట్ నాయకులు జె.అయోధ్యరాము, వైటి.దాస్, జె.సింహాచలం, ఆర్‌ఎస్.రాజు, జి.బోసుబాబు, సోమన్న, డి.అప్పారావు, వి.శ్రీనివాసు, సిహెచ్.సన్యాసిరావు, కె.శ్రీనివాసులనాయుడు, మహాలకిëనాయుడు, ఆర్.భాస్కర్ తదితరులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి