ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

విశాఖలో స్వైన్‌ఫ్లూ నిర్ధరణ కేంద్రం

- మంత్రి గంటా వెల్లడి - స్వైన్‌ఫ్లూ పరిస్థితులపై సమీక్ష
విశాఖపట్నం, చైతన్యవారధి: విశాఖనగరంలో స్వైన్‌ఫ్లూ నిర్ధరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసే యోచన ఉందని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో స్వైన్‌ఫ్లూ పరిస్థితులపై ఆయన సమీక్షించారు. స్వైన్‌ఫ్లూ నిర్ధరణ కేంద్రం ఏర్పాటుకు ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నందున అవసరమైన
ఏర్పాట్లు చేయాలని ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. నివేదికలు వచ్చే వరకు ఆగకుండా అనుమానిత రోగులకు వైద్యం అందించాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా స్వైన్‌ఫ్లూ వార్డులు ఏర్పాటు చేయాలని, అవసరమైన ఔషధాలు, వెంటిలేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. స్వైన్‌ఫ్లూపై ప్రజల్లో అవగాహన పెంచడానికి పెద్దఎత్తున ప్రచారం చేపట్టాలని సూచించారు. బస్టేషన్లు, రైల్వేస్టేషన్‌, ఎయిర్‌పోర్టుల్లో స్వైన్‌ఫ్లూ వడబోత కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.యువరాజ్‌ తాజా పరిస్థితిని వివరించారు. ఇంతవరకు 20 అనుమానిత కేసులు నమోదయ్యాయన్నారు. వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ప్రభుత్వం ఈ అంశానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నందున ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆరోగ్యశాఖ అధికారులు డాక్టర్‌ సోమరాజు, డాక్టర్‌ సరోజని, ప్రైవేటు ఆసుపత్రులకు చెందిన ప్రతినిధులు సమీక్షలో పాల్గొన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
హైదరాబాద్, ఫిబ్రవరి 3: రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తున్న స్వైన్ ఫ్లూపై అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన మంత్రులు కామినేని శ్రీనివాస్, మృణాళిని, ఇతర అధికారులతో సమీక్షించారు. స్వైన్ ఫ్లూ పరిస్థితిపై ఎప్పటికప్పుడు తనకు సమాచారం అందించాలని ఆదేశించారు. వివిధ జిల్లాల్లో వ్యాధి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో 79 మందికి వ్యాధి సోకినట్టుగా అనుమానించి రక్త నమూనాలను పరీక్షించగా, అందులో 37మందికి వ్యాధి నిర్ధారణ జరిగినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కాగా, స్వైన్ ఫ్లూ అనుమానం వచ్చిన వారికి ఐదారు గంటల్లోనే వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి వివరాలు తెలుసుకోవాలని అదేశించారు. అలాగే ప్రతి రోజూ ఎన్ని కేసులు నమోదు అయ్యాయి, ఎంతమందికి చికిత్స అందించారు అన్న వివరాలు కూడా తనకు చెప్పాలని ఆదేశించారు. స్వైన్ ఫ్లూను అరికట్టేందుకు రాష్ట్రంలో అవసరమైతే హెల్త్ ఎమర్జెన్సీని ప్రవేశపెట్టేందుకు కూడా మంత్రి వర్గం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలియచేశారు.

కామెంట్‌లు