చైతన్య వారధి(సింహాచలం): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలే రానున్న పంచాయితీ ఎన్నికలలో కాంగ్రేస్ పార్టీని గెలిపిస్తాయని రాష్ట్ర మార్కెటింగ్ , గిడ్డంగుల శాఖా మంత్రి ముఖేష్‌గౌడ్ అన్నారు.ఆయన గురువారం సింహాచల శ్రీవరాహాలక్ష్మీ నృసింహాస్వామి దర్శనార్థం సింహాగిరికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసేవచేస్తే పదవులు వాటంతట అవే వస్తాయని అన్నారు. పదవులు వచ్చిన తరువాత ప్రజా సేవ మరచిపోకూడదని అన్నారు. సింహాగిరికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. మంత్రి ఆలయంలోని కప్పస్థంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అంతరాయంలో మంత్రి పేరి
ట అర్చకులు సహాస్ర,గోత్ర నామార్చనలతో స్వామివారికి అష్టోత్తర పూజలు నిర్వహించారు.లక్ష్మదేవి సన్నిధిలో విశేష పూజలు నిర్వహించి హరతులు అందజేశారు.అనంతరం ఆలయ అధికారులు ఆయనకు స్వామివారి చిత్రపఠాన్ని ప్రసాదాన్ని అందజేశారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి