ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

పవన్ కళ్యాణ్ పార్టీ పెడతాడా...?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావాలి అంటూ సామాజిక వెబ్ సైట్లలో అభిమానుల గోల, ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మాటలు అందరికీ తెలిసిందే. సీమాంద్రలో కాంగ్రెస్ కు రాష్త్ర విభజనతో వ్యతిరేకత ఏర్పడిన సంగతి తేలిపోయింది. అందుకే కాంగ్రెస్ నుంచి కావాలని కొంతమంది జనాలను బయటకు పంపించి,  వారితో వేరే పార్టీ పెట్టించడానికి కాంగ్రెస్ వ్యూహం పన్నిందన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. . అది నిజమా... కాదా... ఆవ్యూహం పలిస్తుందా.. లేదా, అన్నది పక్కనబెడితే గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు మాత్రం అందుకు అద్దం పడుతున్నాయి. సీమాంద్రాలో జనాన్ని ఆకర్శించాలంటే పాపులర్ సెలిబ్రిటి కావాలి, కాని అలాంటి వారు ఇప్పుడు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ తప్ప మరొకరు కన్పించడం లేదన్నది అందరు ఒప్పుకోవాల్సిన విషయం.
ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ రాష్ట్రంలో ఏ హీరోకు లేనంతగా ఉంది. అందుకే ఆయన రాజకీయాల్లోకి లాగే ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు. కాని ఆయనకు కాంగ్రెస్ అంటేనే కడుపుమంట.  అన్న చిరంజీవి ఆ పార్టీలోకి చేరినందుకే సోదరుడు అని కూడా చూడకుండా చిరంజీవితో విభేదించాడు పవన్ కళ్యాణ్, అలాంటిది ఆయన కాంగ్రెస్ పంచన చేరడం అసాధ్యం.  అయితే  పవన్ రాజకీయాల్లోకి లాగడానికి సంబంధించి మరో కధ ప్రచారంలో ఉంది. విభజన విషయాన్ని తీవ్రంగా విభేదిస్తూ, కాంగ్రెస్ ను ఖండిస్తూ, దానికి నిరసనగా పార్టీకి రాజీనామాకు సిద్దమవుతున్నాడు విజయవాడ ఎంపి లగడపాటి. ఆయనకు రామ్ గోపాల్ వర్మ మంచి మిత్రుడు అన్నది తెలిసిందే. లగడపాటి కొత్త పార్టీ పెడితే ఫలితం అంతంత మాత్రం.
అందుకే పవర్ ఉన్న పవన్ కళ్యాణ్ ను రాజకీయాల్లోకి లాగి, ఆయన ప్రాణంగా భావించిన ప్రజారాజ్యం పార్టీకి ఆయనతోనే జీవం పోయించి, లేదా కొత్త పార్టీ పెట్టించాలన్న ఆలోచన చేస్తున్నారన్నది ఓ వార్త ప్రచారంలో ఉంది. నిజానికి రామ్ గోపాల్ వర్మకు రాజకీయాలతో సంబందం లేదు, కాని లగడపాటికి స్నేహితుడు, కానీ పవన్ తో కూడా ఆయనకు అంత స్నేహం అంటూ కూడా ప్రత్యేకంగా లేదు, కాని వర్మ మాత్రం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావాలి, చిరంజీవి బదులు పవన్ సారథ్యం వహిస్తే ప్రజారాజ్యం ఈరోజు హిట్టయ్యేది, ఆయన   అభిమానులే కాదు, రాష్ట్రం అంతా పవన్ ను రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటోంది అంటూ వాఖ్యానించడమే కాదు, గుళ్లు గోపురాలు తిరుగుతూ పవన్ జపం చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.  ఎటొచ్చి ఈ రాజకీయ చట్రంలో పవన్ కళ్యాణ్ పడతాడా... లేదా.. అన్నదే అందరిలో నెలకొన్న ఉత్కంఠ.

కామెంట్‌లు