విశాఖపట్నం, చైతన్యవారధి: భారతదేశానికి విశాఖపట్నం తూర్పుతీర మణిహారం లాంటిదని కేంద్ర నౌకాయాన, సమాచార సాంకేతిక శాఖ సహాయ మంత్రి మిలింద్ దేవ్‌రా అన్నారు. గురువారం ఆయన పోర్టు ఏరియాలో ఉన్న విశాఖ కంటైనర్ టెర్మినల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇక్కడ ఓడరేవులను అభివృద్ధి
చేయడం ద్వారా మధ్య, ఉత్తర భారతదేశానికి ఎగుమతి, దిగుమతులను మరింతగా పెంచాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉందన్నారు. దీనికి తన పర్యటన ఉపయోగపడుతుందన్నారు. అంతకుముందు కేంద్రమంత్రి దేవరాకు పోర్టు ఛైర్మన్ అజేయ కల్లం, వి.సి.టి ముఖ్య నిర్వహణాధికారి కెప్టెన్ శ్రీరామ్‌రవిచందర్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కంటైనర్ టెర్మినల్ అభివృద్ధి, సముద్ర వ్యాపార విధానం, మార్గ హేతుబద్దీకరణ తదితర అంశాలను వారు కేంద్రమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ఔటర్ హార్బర్‌ను మంత్రి తిలకించారు.
కేంద్రమంత్రితో గంటా భేటీ
గురువారం ఉదయం నొవొటెల్ హోటల్లో బసచేసిన కేంద్రమంత్రి మిలింద్ దేవ్‌రాను రాష్ట్ర ఓడరేవులు, మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖ పోర్టు అభివృద్ధికి తీసుకోవల్సిన చర్యలు, హార్బర్ సమస్యలు, కాలుష్య నివారణ అంశాలపై చర్చించారు. గంగవరం పోర్టు అంశాలతో పాటు రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈనెల 8న ముంబయిలో నౌకాయాన రవాణా పద్ధతులపై జరగనున్న సదస్సుకు మంత్రి గంటాను కేంద్రమంత్రి దేవ్‌రా ఆహ్వానించారని అధికారిక ప్రకటనలో తెలిపారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి