ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

డ్రైవర్లు నిబంధనలు పాటించాలి

- ఆర్టీవో జి.వివేకనందరెడ్డి
విశాఖపట్నం, చైతన్యవారధి: మానవ తప్పిదాలతోనే 90 శాతం ప్రమాదాలు సంభవిస్తున్నాయని, వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా నిబంధనలు పాటించాలని ఆర్టీవో జి.వివేకనందరెడ్డి సూచించారు. రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా గురువారం రవాణా కార్యాలయంలో వివిధ వాహనాల డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాలపై
అవగాహన కల్పించారు. భారీ వాహనాలు నడిపే ముందు సాంకేతిక లోపాలను గుర్తించాలని, బ్రేకులు, గేరు పార్టులను సరిచూసుకోవాలన్నారు. మద్యం, మత్తు పానీయాలు సేవించి డ్రైవింగ్‌ చేయకూడదని పేర్కొన్నారు. నిబంధనలు పాటించకపోవటంతో ఏటా 14 లక్షల మంది చనిపోతున్నారని, 80 లక్షల మంది క్షతగాత్రులవుతున్నారని ఆయన గుర్తుచేశారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, పరిస్థితితీవ్రతను బట్టి వారి లైసెన్సులు కూడా రద్దుచేస్తామన్నారు. అనంతరం వాహనం నడిపేటప్పుడు పాటించాల్సిన నియమ నిబంధనలపై పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా డ్రైవర్లకు అవగాహన కల్పించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న 150 మంది డ్రైవర్లకు రవాణాశాఖ ముద్రతో ఉన్న ధ్రువపత్రాలను అందజేశారు.

ప్రమాద బాధితులకు సాయమందించాలి..
రోడ్డు ప్రమాదాల్లో బాధిత వ్యక్తులకు మానవతా దృక్పథంతో తక్షణమే సహాయం అందిస్తే, వారి ప్రాణాలు కాపాడిని వారిమవుతామని 'ది ఎబిలిటీ ఫీపుల్స్‌' స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు దిలిప్‌ కుమార్‌ పాత్రో అన్నారు. రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా డ్రైవర్లకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదం సంభవించినప్పుడు తక్షణ సహాయం అందకపోవటంతోనే తాను వికలాంగుడిగా మారానని, తనలాంటి పరిస్థితి మరొకరికి రాకూడదనే ఉద్దేశంతోనే ఈ సంస్థను స్థాపించటం జరిగిందన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి సహాయం అందించి, కృత్రిమ అవయవాలు, వైద్య సదుపాయాలను కల్పించడం తమ సంస్థ ముఖ్య ఉద్దేశమన్నారు. నగరంలో 123 ప్రమాదకరమైన ప్రాంతాలను గుర్తించామని, ప్రమాదం జరిగిన వెంటనే టోల్‌ఫ్రీ నంబర్‌ 1800-425- 8911 కు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్టీవో మురళీధర్‌, వెహికల్‌ ఇన్స్‌స్పెక్టర్లు ఆర్‌.సీహెచ్‌. శ్రీనివాస్‌, ప్రవీణ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు