ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

అగ్నిమాపక యంత్రాలు అమర్చుకోవాలి

- మంత్రి గంటా శ్రీనివాసరావు
విశాఖపట్నం, చైతన్యవారధి: రద్దీగా ఉండే నిలయాలలో తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలని అనుకోని సంఘటనలుచోటుచేసుకుంటే ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర మౌళిక వసతులు, ఓడరేవుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. నగరంలో ఉన్న కళ్యాణమండపాలు, ఆసుపత్రులు,
పాఠశాలలు, సినిమాహాళ్లు, మాల్స్‌లలో అగ్ని ప్రమాద నివారణ చర్యలతోపాటు, ప్రజలకు ఇబ్బంది కలుగకుండా పార్కింగ్‌ను సమకూర్చుకోవాలన్నారు. గురువారం జీవీఎంసీలో ఆయా యజమానులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో 94 కళ్యాణ మండపాలుండగా కేవలం రెండింటికే అన్ని సౌకర్యాలున్నాయని, మిగతా యజమానులకు నోటీసులు ఇప్పటికే జీవీఎంసీ జారీచేసిందన్నారు. నగరంలో 3 వేల పాఠశాలలుండగా కేవలం 200 మాత్రమే అన్ని సౌకర్యాలు కలిగి ఉన్నాయన్నారు. మిగతా పాఠశాలలకు వచ్చే ఏడాది నుంచి అనుమతి క్రమబద్దీకరణ నిరాకరించనున్నట్లు చెప్పారు. కమిషనర్‌ ఎంవీ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతీ పెద్ద నిర్మాణానికి అగ్ని ప్రమాద నివారణ యంత్రాలు అవసరమన్నారు. ఆసుపత్రులు, పాఠశాలలు ప్రత్యేకమైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరముందన్నారు. ప్రధాన పట్టణ ప్రణాళికాధికారి బాలకృష్ణ మాట్లాడుతూ ఇరవై ముప్పై ఏళ్ల క్రితం నిర్మాణంలో 20శాతం పార్కింగ్‌ కోసం కేటాయించాల్సి వచ్చేదని, 2007 తరువాత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 33శాతం పార్కింగ్‌ కోసం కేటాయించాల్సి ఉందన్నారు. అనంతరం ప్రాంతీయ అగ్నిమాపక అధికారి ఎస్వీ నరసింహం అగ్ని ప్రమాదాలు జరిగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తను వివరించారు. ప్రస్తుతం జరుగుతున్న అగ్ని ప్రమాదాలలో 48శాతం షార్ట్‌ సర్క్యూట్‌ వల్లనేన్నారన్నారు. అనంతరం యజమానులు తమ ఇబ్బందులను మంత్రి, కమిషనర్‌ దృష్టికి తీసుకువచ్చారు. బీఆర్‌టీఎస్‌ రహదారిలో ఉన్న భవనాలపై సందిగ్థత నెలకొందని, ఎంత మేర రహదారి నిర్మాణం కోసం తొలగించనున్నారో తెలియదని చెప్పారు. గత రెండేళ్ల నుంచి దరఖాస్తు చేసుకున్నా, తనిఖీలు నిర్వహించడంలేదని, క్రమబద్దీకరణ పత్రాలు ఇవ్వలేదని మంత్రి దృష్టికి తీసుకురాగా, కమిషనర్‌ మాట్లాడుతూ ఇకపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తారన్నారు. పార్కింగ్‌ను ఇప్పటికిప్పుడు ఏర్పాటుచేసుకోవడం కష్టమవుతుందని మంత్రి దృష్టికి తీసుకురాగా, జీవీఎంసీ, వుడా ద్వారా పార్కింగ్‌ కోసం నిర్మాణాలు చేయిస్తామన్నారు. ప్రభుత్వ స్థలాలను పార్కింగ్‌ కోసం కేటాయిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ పీవీ రమణమూర్తి, డీసీఆర్‌ సోమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు