- ఆర్టీసీ ఈడీ ఎ.రామకృష్ణ
విశాఖపట్నం, చైతన్యవారధి: రహదారి ప్రమాదాల నివారణే ధ్యేయంగా ఆర్టీసీ డ్రైవర్లు ఉండాలని సంస్థ విజయనగరం జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ.రామకృష్ణ అన్నారు. 24వ రహదారి భద్రత వారోత్సవాలను మద్దిలపాలెం గ్రామీణ డిపోలో మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంతో పోల్చితే ఆర్టీసీలో ప్రమాదాల సంఖ్య
గణనీయంగా తగ్గిందన్నారు. డ్రైవర్లు సంస్థకు వెన్నెముక వంటివారన్నారు. ఉప రవాణా కమిషనర్ మహ్మద్‌సలీం మాట్లాడుతూ 'మద్యం సేవించి వాహనాలను నడపకండి, హాయిగా జీవించండి' అన్న నినాదంతో వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రమాద ప్రాంతాలను గుర్తించి నివారణకు చర్యలు, విద్యాసంస్థల బస్సుల తనిఖీ, సరకు రవాణా వాహనాల్లో ప్రయాణికులను ఎక్కించకుండా తనిఖీలు చేపడతమన్నారు. ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్ వై.జగదీశ్‌బాబు మాట్లాడుతూ వాహన చోదకులు మద్యం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. సెల్ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ కూడదన్నారు. 2011-12 సంవత్సరానికి ఆర్టీసీ రోడ్డు భద్రత అవార్డు దక్కించుకోవడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా తొమ్మిది మంది ఉత్తమ డ్రైవర్లు, వారి కుటుంబసభ్యులను సత్కరించారు. కార్యక్రమంలో అధికారులు పబ్బా జీవన్‌ప్రసాద్, ఎ.వీరయ్యచౌదరి, అప్పలనారాయణ, అప్పలనాయుడు, ఎ.గంగధారరావు, ఎస్.మురళీమోహన్, ఈయూ నాయకులు పలిశెట్టి దామోదరరావు, ఎంవీఐ ఎ.హెచ్.ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి