ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

మూడో గురువారం పూజలకు ఏర్పాట్లు

విశాఖపట్నం, చైతన్యవారధి: కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా మూడో గురువారం పూజలకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజున అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశాలున్నాయి. లక్ష మందికి పైగా భక్తులు వస్తారని దేవస్థానం అధికారులు అంచనా
వేస్తున్నారు. దీనికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని, తొక్కిస లాటలు, వి.ఐ.పి. దర్శనాల లైన్ల వద్ద ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలను తీసుకుంటున్నారు. బుధవారం అర్ధరాత్రి 12.05 గంటలకు అమ్మవారికి దేవస్థానం పరంగా విశేష పంచామృతాభిషేకం నిర్వహిస్తారు. కుంకుమపూజ, పాలాభిషేక వంటి సేవలు కొనసాగిస్తారు. ముందుగా టిక్కెట్లు తీసుకున్న ఉభయదాతలను ఈ పూజలకు అనుమతిస్తారు. అర్ధరాత్రి దాటాక 2గంటల నుంచి దర్శనాలకు భక్తులను అనుమతిస్తారు. అప్పటి నుంచి గురువారం సాయంత్రం వరకు నిరంతరాయంగా దర్శనాలు కొనసాగుతాయి. అర్ధరాత్రి నుంచే భక్తుల తాకిడి ఉండే అవకాశాలున్నాయి. బుధవారం సాయంత్రం నుంచి ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నామని దేవస్థానం ఈఓ డి.భ్రమరాంబ తెలిపారు. టౌన్‌కొత్తరోడ్డు నుంచి పోర్టు అప్రోచ్‌ రోడ్డుమీదుగా పాతపోస్టాఫీసుకు వాహనాల రాకపోకలను మళ్లిస్తున్నామని తెలిపారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరారు. టౌన్‌ కొత్తరోడ్డు నుంచే పందిళ్లు వేశామని చెప్పారు. దేవదాయశాఖకు చెందిన దాదాపు 150 మంది ఉద్యోగులను విధుల్లో నియమించామని చెప్పారు. పోలీసు శాఖ పరంగా గట్టిబందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. భక్తులకు అవసరమైన తాగునీరు, మజ్జిగ ఉచితంగా సరఫరా చేస్తున్నామన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఉచితంగా అయిదు బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు చెప్పారు. దేవస్థానం పరంగా నాలుగు, దాత సహాయంతో ఒకటి ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అగనంపూడి, సింహాచలం, పెందుర్తి, మధురవాడ ప్రాంతాల నుంచి ఆలయం వరకు గురువారం ఉదయం 6గంటల నుంచి రాత్రి 9గంటల వరకు బస్సులు నడుపుతామని వివరించారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

కామెంట్‌లు