ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు

విశాఖ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ప్రకంపనల కేంద్రం
విశాఖపట్నం, చైతన్యవారధి: కొత్త సంవత్సరం తొలి రోజున భూప్రకంపనలు జిల్లా ప్రజలను కలవరపరిచాయి. నర్సీపట్నం రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని నర్సీపట్నం, కోటవురట్ల, మాకవరపాలెం, రోలుగుంట, పాడేరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని కొయ్యూరు, జి.మాడుగుల, విశాఖ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని చోడవరం, బుచ్చియ్యపేట,
రావికమతం, చీడికాడ, వి.మాడుగుల మండలాల్లో ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. ఉదయం 7.29 గంటలకు 2.9 తీవ్రతతో భూమి కంపించినట్టు విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. భూకంప కేంద్రం విశాఖపట్నానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉందని పేర్కొన్నారు. ప్రకంపనలను గుర్తించిన పలువురు తీవ్రఆందోళనకు గురయ్యారు. దీన్ని నిర్ధారించుకోవడంకోసం విశాఖపట్నం వాతావరణ కేంద్రానికి పలువురు ఫోన్లుచేసి వాకబుచేశారు. సుమారు అయిదు సెకెండ్లపాటు భూమి కంపించినట్టు ప్రకంపనలు వచ్చిన ప్రాంతాలకు చెందిన పలువురు చెప్పారు. నర్సీపట్నంలో అపార్ట్‌మెంట్లలో నివసించే ప్రజలు ప్రకంపనలతో తీవ్ర భయానికి గురై, ఫ్లాట్ల నుంచి కిందకు పరుగులు తీశారు. కొత్త సంవత్సరం ఆనందంలో మునిగితేలాల్సిన సమయంలో ప్రకంపనల కారణంగా ఎక్కడచూసినా దానిపైనే చర్చ జరిగింది. విశాఖ జిల్లా నర్సీపట్నం కేంద్రంగా 2008 మే 29న సాయంత్రం 4.50గంటలకు భూకంపం సంభవించింది. దీని తీవ్రత 3.7గా నమోదైంది. అప్పట్లో మూడు సెకెండ్లపాటు భూమి కంపించింది. నర్సీపట్నానికి ఉత్తర-వాయువ్య దిశగా నాలుగు కిలోమీటర్ల దూరంలో భూకంపకేంద్రం ఉన్నట్టు గుర్తించారు. ఇప్పటి కంటే తీవ్రమైనదికావడంతో జనం భీతావహులయ్యారు. జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కోటవురట్ల, మాకవరపాలెం, నాతవరం, మాడుగుల, బుచ్చియ్యపేట, చోడవరం, రావికమతం తదితర ప్రాంతాల్లో భూకంప తీవ్రత కనిపించింది. 2008 భూకంపం కారణంగా జిల్లాలో స్వల్ప నష్టం నమోదైంది. భూకంపాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ జోన్‌ -2, జోన్‌-3 పరిధిలో ఉంది. రాష్ట్రంలో భద్రాచలం, ఒంగోలు ప్రాంతాల్లో మాత్రమే ఓ మాదిరి భూకంపాలు వచ్చే అవకాశముంది. కోస్తాతీరంలో శ్రీకాకుళం నుంచి కాకినాడ వరకూ ఉన్న ప్రాంతం సేఫ్‌జోన్‌లో ఉంది. అయితే, చిన్న ప్రకంపనలు తప్పవని అధికారులు పేర్కొంటున్నారు.

కామెంట్‌లు