విశాఖపట్నం, చైతన్యవారధి: విశాఖపట్నం నుంచి మండల కేంద్రమైన గూడెం కొత్తవీధి గ్రామానికి ఎపిఎస్‌ఆర్‌టిసి బస్సు సర్వీసును రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి పసుపులేటి బాలరాజు ప్రారంభించారు. మంగళవారం మధ్యాహ్నం విశాఖపట్నం ద్వారకా బస్‌స్టేషన్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి జెండా వూపి ఈ ఎక్స్‌ప్రెస్ బస్
సర్వీసును ప్రారంభించారు. నర్సీపట్నం డిపోకు చెందిన ఈ కొత్త బస్ సర్వీసు ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటలకు నర్సీపట్నంలో బయల్దేరి సాయంత్రం 4.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. విశాఖలో 4.45 గంటలకు బయల్దేరి రాత్రి 9.15 గంటలకు గూడెం చేరుకుంటుంది. నైట్ హాల్ట్ అనంతరం మరునాడు ఉదయం 5 గంటలకు బయల్దేరి 9.45 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఈ సర్వీసు వల్ల చింతపల్లి ఏజెన్సీ నుంచి విశాఖపట్నం వచ్చే ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాసరావు, సతీష్‌వర్మ, ఆర్‌టిసి రిజనల్ మేనేజరు వై జగదీష్‌బాబు, డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్లు (రూరల్), పి జీవన్ ప్రసాద్, అర్బన్ డిసిఎం ఎ వీరయ్యచౌదరి, నర్సీపట్నం, పాడేరు, విశాఖపట్నం డిపో మేనేజర్లు ప్రవీణ్, ప్రవీణ, గంగాధర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి