న్యూఢిల్లీ: సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో బాంబు అమర్చినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజేందర్ చౌదరికి హైదరాబాద్‌లోని మక్కా మసీదు బాంబు పేలుడు ఘటనలోనూ పాత్ర ఉండి ఉండవచ్చని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) భావిస్తోంది. మక్కా మసీదు వద్ద మే 18వ తేదీన 2007లో జరిగిన పేలుళ్లలో 9 మంది మరణించారు. ఈ కేసును పరిష్కరించడంలో రాజేందర్ చౌదరి అరెస్టు ఉపకరిస్తుందని ఎన్‌ఐఏ యోచిస్తోంది. ఉజ్జయినికి 50
కిలోమీటర్ల దూరంలోని నాగ్డా వద్ద శనివారం రాత్రి రాజేందర్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అతని పేరు మీద ఎన్‌ఐఏ రూ. 5 లక్షల నగదు బహుమతి కూడా ప్రకటించింది. సంజౌతా ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పెట్టిన విషయంపైనా, మక్కా మసీదు పేలుడు అంశంపైనా దర్యాప్తు అధికారులు రాజేందర్‌ను ప్రశ్నించనున్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి