కొత్త బిల్లుకు స్విట్జర్లాండ్ ప్రతిపాదన
న్యూఢిల్లీ/బెర్న్: భారత్, ఇతర దేశాలకు చెందిన పన్నుఎగవేతదారుల నల్లధనానికి తమ బ్యాంకులు సురక్షిత స్థావరంగా ఉంటున్నాయని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో స్విట్జర్లాండ్ ప్రభుత్వం స్పందించింది. దేశంలోని బ్యాంకులు, ఇతర ఆర్థికసంస్థల్లోకి వస్తున్న నల్లధన ప్రవాహాన్ని అడ్డుకోవాలని భావిస్తోంది.
ఇందులో భాగంగా కొత్త బిల్లును ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. దీంతో ఖాతాదారులు పన్ను చెల్లించకుండా పోగుచేసే సొమ్మును బ్యాంకులు స్వీకరించడం కుదరదు. అర్హులైన వ్యక్తులే సొమ్ము దాచుకునేలా కచ్చితమైన నిబంధనలు రూపొందిస్తారు. స్విస్ ప్రభుత్వంలో కీలక విధాన నిర్ణయాలు తీసుకొనే స్విట్జర్లాండ్ ఫెడరల్ కౌన్సిల్ గత శుక్రవారం బెర్న్‌లో సమావేశమైంది. బ్యాంకులు ఖాతాదారుల నుంచి నల్లధనాన్ని స్వీకరించకుండా నిరోధించే విషయంలో సంప్రదింపుల ముసాయిదాను రూపొందించాలని దేశ ఆర్థిక మంత్రిత్వశాఖను ఆదేశించింది. 2013 ఆరంభంలో నివేదికను తమకు సమర్పించాలని సూచించింది. నల్లధనానికి అడ్డాగా మారుతున్న స్విస్ బ్యాంకులపై చర్యలు తీసుకోవాలంటూ అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న ఒత్తిళ్ల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ''మనీ లాండరింగ్, పన్నువిధానాల చట్టాల దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి చర్యలు ప్రారంభించాం'' అని స్విస్ ఫెడరల్ కౌన్సిల్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆర్థికశాఖకు చెందిన యాక్షన్ టాస్క్‌ఫోర్సు ఇచ్చే సవరణ ప్రతిపాదనలను ప్రణాళిక బద్ధంగా అమలుపరుస్తామని స్పష్టం చేసింది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి