ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

అంతర్రాష్ట్ర దొంగలముఠా సభ్యులు అరెస్టు

1.4 కేజీల బంగారం స్వాధీనం
విశాఖపట్నం: విశాఖలో పలు దొంగతనాలకు పాల్పడి మంగళవారం పట్టుబడ్డ ముగ్గురు కరడు గట్టిన దొంగల్ని అరెస్టు చేసినట్లు విశాఖ సీపీ శివధర్‌ రెడ్డి ఈరోజు తెలిపారు. బుధవారం నగర పోలీస్‌ కమిషనరేట్‌ సమావేశమందిరంలో జరిగిన విలేకరుల సమావేశంలో దొంగల వివరాలను వెల్లడించారు.
ఉత్తర ప్రదేశ్‌కి చెందిన భగవాన్‌ గిరి, సలీం ఖురేషీ నేర జీవితానికి అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నారన్నారు. ఈ నెల ఒకటిన విశాఖ వచ్చి రెండు లాడ్జీల్లో బసచేసి పలు దొంగతనాలకు పాల్పడ్డారని చెప్పారు. మంగళవారం కూర్మన్న పాలెం అక్షర అపార్ట్‌మెంట్లో దొంగతనం చేసి, గుర్తించిన వాచ్‌మెన్‌పై దాడిచేసి పారిపోగా, వాచ్‌మన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్రమత్తమైన పోలీసులు సరిహద్దుప్రాంతాల్లో వాహనతనిఖీలు నిర్వహించగా విశాఖ జిల్లాలోని నక్కపల్లి వద్ద దొంగలు పోలీసులకు తారసపడ్డారు. ఎస్‌ఐపై దాడిచేసి పారిపోవడానికి ప్రయత్నించిన వారిని పోలీసులు అఎస్టు చేశారు. వారి వద్ద నుంచి 1.4 కిలోల బంగారం, 5,700 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

కామెంట్‌లు