పరవాడ: సింహాద్రి ఎన్టీపీసీ ప్లాంటు అభివృద్ధికి ఇన్‌ఛార్జి జి.ఎం డి.కె.సూద్ చేసిన సేవలు అమోఘమని ప్లాంటు వో అండ్ టెక్నికల్ సర్వీస్ విభాగాల జి.ఎంలు నరేంద్ర, సంతోష్‌జేమ్స్ అన్నారు. ఢిల్లీ దాద్రి పవర్ ప్లాంటు జీఎంగా బదిలీ అయిన సందర్భంగా సూద్‌కు శనివారం ఘనంగా వీడ్కోలు పలికారు. దీపాంజలినగర్ ఆడిటోరియంలో ఏర్పాటు
చేసిన సభలో వారు మాట్లాడుతూ ఎటువంటి సమస్య వచ్చినా సూద్ ధైర్యంగా ఎదుర్కొని పరిష్కరించేవారని కొనియాడారు. 18 గ్రామాల్లో తాగునీటి ట్యాంకులు నిర్మించి నిర్వాసితుల దాహార్తిని తీర్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. సూద్ మాట్లాడుతూ ఇక్కడి ప్లాంటు అభివృద్ధికి ఉద్యోగులు, కార్మికులు అందించిన సహకారాలు మరువలేనివన్నారు. ప్లాంటు మూడు, నాలుగు యూనిట్ల పనులు విజయవంతం కావడానికి ఉద్యోగులు శ్రమించారన్నారు. అనంతరం ఉద్యోగులు, దీపికా లేడిస్ క్లబ్ సభ్యులు కలిసి సూద్ దంపతులను జ్ఞాపికలతో సత్కరించారు. అయిదు నిమిషాలపాటు చప్పట్లు కొట్టి సాదరంగా వీడ్కోలు పలికారు. ఏజీఎం, డీజీఎం, ఉద్యోగులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి