-పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల
సబ్బవరం, చైతన్యవారధి: తుపాను బాధిత రైతులను ఆదుకోవడానికి ఈ నెల 18న తమ పార్టీ అధినేత చిరంజీవి జిల్లాలో పర్యటిస్తారని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు తెలిపారు. సబ్బవరంలో మండల పిఆర్‌పి అధ్యక్షుడు పిబివిఎస్‌ఎన్.రాజు కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రజలపై భారం పడకుండా ఉండేందుకే ప్రస్తుత రాష్ట్రప్రభుత్వానికి పిఆర్‌పి తన పార్టీ మద్దతు ఇస్తోందన్నారు. పత్రికలు ఊహించిన విధంగా తమ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌లో విలీనం కాదని పేర్కొన్నారు. రాజకీయాల్లో అనిశ్చిత ఏర్పడిందని, నైతిక విలువలు పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ వెంట ఓదార్పు యాత్రలో పాల్గొన్న రాజకీయ నాయకులు తమ పదవులకు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో కాంగ్రెస్‌లో జగన్ చేరే అవకాశం ఉందని జోష్యం చెప్పారు. ఇద్దరు పిఆర్‌పి ఎమ్మెల్యేలు జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొనడంపై విలేకర్లు ప్రస్తావించగా, వారిపై త్వరలో క్రమ శిక్షణా చర్యలు తీసుకునేందుకు గురువారం సమావేశం జరగనుందని అన్నారు. గత ఏడాదిన్నర కాలంలో రాజకీయ అనిశ్చిత కారణంగానే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో పిఆర్‌పి మండలాధ్యక్షుడు పిబివిఎస్‌ఎన్.రాజు, పిఆర్‌పి నాయకులు గవర శ్రీనివాసరావు, కర్రి బంగారునాయుడు, అండిబోయిన బంగారయ్య, కనకరాజు తదితరులు పాల్గొన్నారు.
సబ్బవరం, చైతన్యవారధి: తుపాను బాధిత రైతులను ఆదుకోవడానికి ఈ నెల 18న తమ పార్టీ అధినేత చిరంజీవి జిల్లాలో పర్యటిస్తారని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు తెలిపారు. సబ్బవరంలో మండల పిఆర్‌పి అధ్యక్షుడు పిబివిఎస్‌ఎన్.రాజు కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి