ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

బస్సు ఎక్కడుందో తెలిపే తెరలు

హైదరాబాద్‌: బయలుదేరిన బస్సు ఏ సమయంలో ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉందో తెలుసుకోవాలని ఉందా? బస్సు ఎన్ని గంటలకు బస్టాండుకు చేరుతుందో సమాచారం కావాలనుకుంటున్నారా? ఇలాంటి వివరాల్ని బస్సు ప్రాంగణాల్లో ప్రతి ప్రయాణికుడు తెలుసుకునే వ్యవస్థను ఏర్పాటు చేసే పనిలో ఆర్టీసీ నిమగ్నమైంది.
శాటిలైట్‌ అనుసంధానంతో పనిచేసే గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టం(జీపీఎస్‌) ద్వారా ఈ సరికొత్త వ్యవస్థను తీర్చిదిద్దేందుకు సంస్థ అధికారులు యత్నిస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సు ఒక బస్టాండ్‌ నుంచి బయలుదేరితే తర్వాత స్టేజీకి ఎన్ని గంటలకు చేరుతుందో తెలియక ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితిలో మార్పును తీసుకొచ్చి బయలుదేరిన బస్సు మరుసటి స్టేజీకి ఎన్ని గంటలకు చేరుతుందో తెలియజేయడం కోసం కండక్టర్లకు సెల్‌ఫోన్లు ఇవ్వాలని యోచించారు. ఈ విధానాన్ని వెంటనే అమలులోకి తేవడానికి ప్రయత్నాలు జరుగుతున్నా, అంతగా విజయవంతమయ్యే అవకాశాలు కన్పించడం లేదు. కండక్టర్లు సరిగా స్పందించకపోయినా, బస్సు వివరాలను చెప్పడంలో ఆయా స్టేజీల్లోని అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించినా లక్ష్యం దెబ్బతినే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జీపీఎస్‌ సాంకేతిక పరిజ్ఞానం సాయం తీసుకోవాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్ణయించారు.

ఇదీ పద్ధతి..: మొదటగా ఎంపిక చేసిన ప్రధాన మార్గాల్లో జీపీఎస్‌ సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే బ్లాకుబాక్సు పరికరాలను ఏర్పాటు చేస్తారు. ఆయా మార్గాల్లో తిరిగే బస్సులు, బస్టాండ్లతోపాటు మార్గంమధ్యలో కీలక ప్రాంతాల్లో ఈ పరికరాల్ని అమర్చుతారు. ఈ మొత్తం వ్యవస్థను బస్టాండ్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జీపీఎస్‌తో అనుసంధానం చేస్తారు. ఈ మార్గంలో వెళ్లే బస్సు.. బ్లాక్‌బాక్సు ఏర్పాటు చేసిన ప్రాంతానికి చేరుకోగానే ఆ మార్గంలోని అన్ని బస్టాండ్లకూ బస్సు ఎక్కడ ఉందన్న సమాచారం చేరిపోతుంది. బస్టాండులో జీపీఎస్‌ పరిజ్ఞానానికి అనుసంధానిస్తూ ఏర్పాటు చేసిన తెరపై ఫలానా సర్వీసు నెంబర్‌తో, ఫలానా ప్రాంతానికి వెళ్లే బస్సు ఫలానా స్టేజి వద్ద ఉందన్న సమాచారం ఎప్పటికప్పుడు ప్రత్యక్షమవుతుంది.

కామెంట్‌లు