హైదరాబాద్: కేంద్రమంత్రి పురందేశ్వరి కూచిపూడి నృత్యం పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. తాను చిన్నప్పుడు నేర్చుకున్న ఈ నృత్యాన్ని సభికుల ముందు ప్రదర్శించారు. హెచ్‌ఐసీసీలో జరుగుతున్న రెండో అఖిల భారత నాట్య సమ్మేళనానికి ఆమె గౌరవ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. రెండో రోజు శనివారం కార్యక్రమాలను తిలకించేందుకు వచ్చిన పురందేశ్వరిని ప్రముఖ నర్తకి యామిని కృష్ణమూర్తి నృత్యం చేయాలని అభ్యర్థించారు. దీంతో ఆమె వేదికపై నర్తించి ప్రేక్షకులను అలరించారు. ప్రముఖ నాట్యగురువు...
వెంపటి చిన సత్యం తనయుడు రవిశంకర్ జతులకు రెండు నిమిషాలు నర్తించి కళలపై తనకున్న మక్కువను చాటుకున్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి