హైదరాబాద్: రైతు సమస్యల పరిష్కారం కోసం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ప్రకటించిన చర్యలు ఏమాత్రం సరిపోవని ప్రజారాజ్యం పార్టీ తెలిపింది. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు రుణాల మంజూరులో ఉన్న లొసుగులను తొలగించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రరాపా సీనియర్‌నేత కోటగిరి విద్యాధరరావు కోరారు.
గిట్టుబాటు ధర వచ్చేందుకు వీలుగా ఉప్పుడు బియ్యం ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేయాలని కోటగిరి డిమాండ్ చేశారు. అధికారం కోసం పోరాటం చేస్తున్నానని శాసనసభసాక్షిగా చెప్పిన చంద్రబాబు ప్రస్తుతం చేపట్టిన నిరాహారదీక్షను ప్రజలు కూడా అదేకోణంలో చూస్తున్నారని కోటగిరి విమర్శించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి