ఢిల్లీ: ఏఐసీసీ ప్లీనరీలో రెండో రోజు రాహుల్‌గాంధీ ప్రసంగించారు. పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం తప్పనిసరి అని, అవినీతి పరులను కఠినంగా శిక్షించాలని రాహుల్ అన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా కార్యకర్తలు తమకూ అవకాశం కల్పించాలని కోరుతున్నారని, పార్టీలో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని సూచించారు.
ప్రతి సమస్యపై పోరాడేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న అతిపెద్ద సంపద మానవ వనరులని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు కార్యకర్తల మాటలు వినాలని, వారిని గౌరవించాలని అన్నారు. కార్యకర్తలతోనే కాంగ్రెస్‌పార్టీని పటిష్టం చేయాలని వెల్లడించారు. వ్యవస్థతో సాధారణ పౌరులకు సంబంధం తగ్గిపోతోందని, సామాన్యుణ్ని గౌరవించనంతకాలం మనం మంచి వ్యవస్థను నెలకొల్పలేమన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి