Loading...

14, డిసెంబర్ 2010, మంగళవారం

ఆ వంకాయలతో సమస్య లేదు'...

న్యూఢిల్లీ: జన్యుపరివర్తిత వంకాయలను ఆహారంగా తీసుకోవటం వల్ల ఎటువంటి సమస్యలు తలెత్తవని మనదేశంలోని పరిశోధన సంస్థలు స్పష్టం చేశాయి. జన్యుపరివర్తిత వంకాయల సాగు వల్ల పర్యావరణంపైన కూడా నామమాత్రపు ప్రభావమే పడుతోందని పేర్కొన్నాయి. ఈ మేరకు కొన్ని రాష్ట్రాల్లో వీటి సాగును చేపట్టి చూడవచ్చని సిఫార్సు చేశాయి. జన్యుపరివర్తిత పంటలపై అధ్యయనం కోసం కేంద్ర పర్యావరణ మంత్రి జైరాంరమేశ్‌ ఈ ఏడాది మార్చిలో ఒక కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
దీంట్లో ఇంజినీరింగ్‌, వ్యవసాయం, వైద్యం తదితర శాస్త్రరంగాలకు చెందిన ఆరు పరిశోధన సంస్థలు భాగస్వామ్యం వహిస్తున్నాయి. ఈ కమిషన్‌ గతంలో ఇచ్చిన నివేదికపై అభ్యంతరాలు తలెత్తిన నేపథ్యంలో తాజాగా మార్పులు చేర్పులు చేసింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి