గుంటూరు: నాగార్జున విశ్వవిద్యాలయం స్టూడెంట్స్ సెంటర్ హాలులో సీమాంధ్ర విద్యార్థి ఐకాస సమావేశం ప్రారంభమయ్యింది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక మరో రెండు రోజుల్లో రానున్న నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు సీమాంధ్రలోని 14 వర్సిటీల విద్యార్థి జేఏసీలు నాగార్జున
విశ్వవిద్యాలయంలో భేటీ అయ్యాయి. సమైక్యాంధ్ర కోసం ఒత్తిడి తెచ్చేలా ప్రజాప్రతినిధులు ప్రయత్నించకపోతే జనవరి నుంచి వారి ఇళ్ల ముందు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఏయూ జేఏసీ హెచ్చరించింది.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి