హైదరాబాద్: ఈ ఏడాది కురిసిన వర్షాలతో రాష్ట్రంలో అపార నష్టం వాటిల్లిందని, ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి సాయం చేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. జల్ తుపాను, నవంబరులో కురిసిన వర్షాలకు 11.53 లక్షల హెక్టార్లలో వ్యవసాయం దెబ్బతిన్నదని ఆ లేఖలో పేర్కొన్నారు.
ఈ నష్టం రూ.1207.72 కోట్లని తెలిపారు. డిసెంబరు 5 నుంచి 12 వరకు కురిసిన వర్షాల వల్ల కూడా రాష్ట్రంలో అపార నష్టం ఏర్పడిందని పేర్కొన్నారు. దాదాపు 12 లక్షల హెక్టార్లలో 50 శాతం పైబడి పంట దెబ్బతిన్నదని ఆ లేఖలో తెలిపారు. ఈ నష్టం రూ.192 కోట్లని వివరించారు. రూ.400 కోట్ల అడ్వాన్సును గ్రాంట్‌గా మార్చాలని కోరారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి