డర్బన్: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 131 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్‌కు 74 పరుగుల ఆధిక్యం లభించింది.హర్భజన్ సింగ్ స్పిన్ మాయాజాలానికి దక్షిణాఫ్రికా దాసోహమంది. పేస్ విభాగం కూడా రాణించడంతో సఫారీలు భారత్‌కు ఆధిక్యం సమర్పించుకున్నారు.
పీటర్సన్ 24, స్మిత్ 9, ఆమ్లా 33, కలిస్ 10, డివిలియర్స్ 0, ప్రిన్స్ 13, స్టెయిన్ 1, హారిస్ 0, మార్కెల్ 10, సొత్సెబె పరుగులేమీ చేయకుండా అవుటయ్యారు. బౌచర్ 16 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. హర్భజన్ 4, జహీర్ 3, శ్రీశాంత్, ఇషాంత్‌లు చెరో వికెట్ తీశారు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ వికెట్లేమీ కోల్పోకుండా 26 పరుగులతో ఆడుతోంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి