ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

సంయమనం పాటించాలి...టీవీ ఛానళ్లకు ఎన్‌బీఏ సూచన

న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై ఈ నెల 31వ తేదీన శ్రీ కృష్ణ కమిటీ నివేదిక విడుదల చేయనున్న నేపథ్యంలో ఆయా వార్తల కవరేజీలో సున్నితంగా వ్యవహరించాల్సిందిగా 'న్యూస్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ అసోసియేషన్‌' (ఎన్‌బీఏ) వివిధ వార్తా ఛానళ్లను కోరింది. ఈ మేరకు ఎన్‌బీఏ సభ్యులందరికీ వర్తమానం పంపింది.
ప్రసారం చేసే ఏ అంశం కూడా సంచలనాత్మకంగా...ఉద్రిక్తతను ప్రేరేపించే విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండరాదని ఎన్‌బీఏ స్పష్టం చేసింది.
* ప్రజాప్రయోజనాలు... మతసామరస్యం... శాంతియుత సహజీవనానికి ఏ మాత్రం భంగం కలగని రీతిలో మాత్రమే వార్తల ప్రసారం ఉండాలి.

* విభిన్న ప్రజల సమాహారమైన మన సామాజిక లౌకిక విలువలను దెబ్బతీసే పోకడలను పరిహరించాలి.

* మీడియా అందించే సమాచారం ప్రజలపై గట్టి ప్రభావాన్ని చూపుతుందనే విషయాన్ని సంబంధిత సంస్థలు విస్మరించనే కూడదు.

* ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీకృష్ణ కమిటీ నివేదికకు సంబంధించిన వార్తలు ఎక్కడా నైతిక విలువల లక్ష్మణరేఖను దాటనే కూడదు. ఎప్పటికప్పుడు విడుదలయ్యే మార్గదర్శకాల పరిధిని అతిక్రమించనే కూడదు.
* శ్రీకృష్ణ కమిటీ నివేదికలో పేర్కొన్న అంశాలకు మాత్రమే వార్తల కవరేజీ కచ్చితంగా పరిమితం కావాలి.
* హింస, ఆందోళనలు, ఆత్మాహుతులకు సంబంధించిన ఏ తరహా ఫుటేజిని కూడా ప్రసారం చేయకూడదు.
* నివేదికకు సంబంధించి నిరసన ప్రదర్శనలు...ఆనందం వ్యక్తం చేస్తూ నిర్వహించే ఉత్సవాల ఫొటోల జోలికి వెళ్లకూడదు.
* అంతేకాదు, శ్రీకృష్ణ కమిటీ నివేదికకు సంబంధించి ప్రసారం చేసే అన్నిరకాల కార్యక్రమాలను పదిల పరచాలి. దానికి సంబంధించిన రాత ప్రతులను సైతం భద్రపరచాలనీ...మున్ముందు ఏదైనా పరిశీలన నిమిత్తం అవసరం పడితే పనికివస్తాయని ఎన్‌బీఏ కోరింది.

కామెంట్‌లు