విశాఖపట్నం, చైతన్యవారధి: ఏయూ అంతర్ కళాశాలల యువజనోత్సవాలను ఈనెల 21నుంచి రాజమండ్రిలోని గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్(గైట్) కళాశాలలో నిర్వహించనున్నట్లు విద్యార్థి వ్యవహారాల డీన్ ఎన్.వెంకటరావు తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో పాల్గొనే ఆయా కళాశాలలు ఈనెల 11 లోపు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. అంబేద్కర్, ఎన్‌టీఆర్ హెల్త్‌వర్సిటీ, హార్టికల్చర్, జేఎన్‌టీయూ వర్సిటీల విద్యార్థులు కూడా పాల్గొనాలని కోరుతూ రిజిస్ట్రార్లకు లేఖలు
పంపించామన్నారు. 26 రంగాల్లో పోటీలు ఉంటాయన్నారు. పాల్గొనే విద్యార్థులు, అధికారులకు గైట్ కళాశాలలో ఉచిత భోజన, వసతి సౌకర్యాన్ని కల్పిస్తారన్నారు. ఇతర వివరాలకు www.giet.ac.in వెబ్‌సైట్ చూడవచ్చని చెప్పారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి