ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

జగన్‌ను తిరిగి పార్టీలో తీసుకునేందుకు ఒత్తిడి

అనకాపల్లి, డిసెంబరు 6 (చైతన్యవారధి):  వై.ఎస్‌.జగన్‌ను తిరిగి పార్టీలో తీసుకునే విధంగా అధిష్టానంపై ఒత్తిడి తీసుకువద్దామని మాజీమంత్రి కొణతాల రామకృష్ణ కాంగ్రెస్ నేతలకు కార్యకక్తలకు చెబుతున్నారు.  స్థానిక న్యూకాలనీలో గల క్యాంప్‌ కార్యాలయంలో నియోజకవర్గాల వారీగా ముఖ్యనేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా సోమవారం పెందుర్తి, అనకాపల్లి నియోజకవర్గాలకుకు చెందిన ముఖ్యులతో ఆయన సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా కొణతాల మాట్లాడుతూ వై.ఎస్‌.జగన్‌ను తిరిగి పార్టీలో తీసుకునే విధంగా అధిష్టానంపై ఒత్తిడి తీసుకువద్దామన్నారు.
సరైన శాఖలు కేటాయించలేదని పలువురు మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తే అధిష్ఠానం రంగంలో దిగి వారిని బుజ్జగించారన్నారు. జిల్లాలో జగన్‌ నిర్వహించే ఓదార్పు యాత్రలో పాల్గొందామన్నారు. స్వంత పార్టీ నేతలను విడిచిపెట్టి ఇతర పార్టీలపై ఆధారపడడం సరి కాదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని పలువురు కాంగ్రెస్‌ నేతలు మాజీమంత్రి కొణతాల రామకృష్ణకు స్పష్టం చేశారు. ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని కొందరు సూచించారు. జగన్‌ వెంట వెళ్లడమే సరైందని మరి కొందరు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డి.సి.ఎం.ఎస్‌ ఛైర్మన్‌ డి.యు.వి.గోపాలరాజు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి, వర్తక సంఘం అధ్యక్షులు కొణతాల పెదబాబు, అనకాపల్లి నియోజకవర్గం అధికార ప్రతినిధి కొణతాల బాబురావు, పురపాలక సంఘం మాజీ ఛైర్మన్‌ కడిమిశెట్టి రాంజీ, మలసాల కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు