-యు.జి.సి. సభ్యుడు ప్రొఫెసర్ కె.రామ్మూర్తినాయుడు
శ్రీకాకుళం, నవంబర్ 21(చైతన్యవారధి): నాణ్యతలేని విద్య నిరుపయోగమని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యు.జి.సి.) సభ్యుడు ప్రొఫెసర్ కె.రామ్మూర్తినాయుడు అన్నారు. మునసబుపేటలోని గురజాడ విద్యాసంస్థల ప్రాంగణంలో ఇంట్రాఫ్యాకల్టీ కార్యక్రమం నిర్వహించారు. ఆయన ముఖ్యఅతిథిగా హాజరైన మాట్లాడుతూ నేటి సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. విద్యలో నాణ్యత లోపిస్తే అది విద్యార్థులకు ఏ మాత్రం ఉపయోగపడదన్నారు. విద్య వైపు బాలబాలికలను ఆకర్షించేలా బోధనలో మెలకువలు పాటించాలన్నారు. విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం ఉపాధ్యాయుల భుజస్కందాలపై ఉంటుందనే విషయాన్ని విస్మరించకూడదన్నారు. ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులు కొత్త విషయాలు తెలుసుకోవాలన్నారు. అనంతరం జాతీయ సెమినార్‌లో పాల్గొన్న విద్యార్థులకు ధ్రువపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ రామ్మూర్తినాయుడు దంపతులను గురజాడ విద్యాసంస్థల వ్యవస్థాపకులు జి.వి.స్వామినాయుడు, సిబ్బంది సన్మానించారు. కార్యక్రమంలో గాయత్రి కళాశాల ప్రిన్సిపల్ డా. పులఖండం శ్రీనివాసరావు, బి.ఇ.డి. కళాశాల ప్రిన్సిపల్ రంగారావు, డైట్ కళాశాల ప్రిన్సిపల్ డి.అప్పారావు, కో-ఆర్డినేటర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి