Loading...
21, నవంబర్ 2010, ఆదివారం
అంతర్ విశ్వవిద్యాలయాల కబడ్డీ పోటీలకు ఎంపిక
శ్రీకాకుళం, నవంబర్ 21(చైతన్యవారధి): సౌత్‌జోన్ అంతర్ విశ్వవిద్యాలయాల కబడ్డీ ఛాంపియన్‌షిప్ పోటీలకు తమ కళాశాల నుంచి ఆరుగురు క్రీడాకారులు ఎంపికయ్యారని స్థానిక ప్రభుత్వ డిగ్రీ(పురుషులు) కళాశాల ప్రిన్సిపల్ బి.పోలీసు తెలిపారు. ఈ పోటీలు ఈనెల 26 నుంచి కర్ణాటకలోని థార్‌వాడ్‌లో జరుగనున్నాయి. కళాశాలకు చెందిన ఎ.జగదీష్, డి.లోకనాథం, డి.పవన్ కళ్యాణ్, పి.పోలినాయుడు, పి.శివప్రసాద్, ఎస్.రామకృష్ణ ఎంపికయ్యారని తెలిపారు. వీరు డాక్టరు బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం తరపున ప్రాతినిధ్యం వహిస్తారని ఆయన చెప్పారు. రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు... స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి 17 ఏళ్లలోపు బాలబాలికల ఖోఖో పోటీలు ఈనెల 25 నుంచి 27 వరకు వరంగల్ జిల్లా ములుగులో జరుగనున్నాయి. ఈ పోటీలకు ఎంపికైన జిల్లా జట్లను స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు, డి.ఇ.ఒ. ఎల్.వైకుంఠరావు, కార్యనిర్వాహక కార్యదర్శి వై.పోలినాయుడు ప్రకటించారు. బాలుర జట్టు సభ్యులుగా కె.ధనుంజ, ఆర్.లోకేశ్వరరావు, జె.సునీల్, వై.శివ(పలాస), ఎస్.నాగరాజు, ఎస్.గవరయ్య(మల్లి). ఎన్.రమేష్(జి.ఎస్.పురం), ఎస్.శ్రీనివాసరావు(బూర్జ), బి.కృష్ణ, ఎల్.కూర్మారావు(లోలుగు), బి.హరిబాబు(కోడూరు), ఎస్.వెంకటరావు(పి.ఎల్.పురం), స్టాండ్‌బైస్‌గా పి.సంతోష్‌కుమార్(పలాస), టి.లచ్చయ్య(జి.ఎస్.పురం) ఎంపికయ్యారు. బాలికల జట్టు సభ్యురాళ్లుగా కె.ఝాన్సీ(సంతకవిటి), సి.హెచ్.స్వర్ణలత, ఎ.భార్గవి(కొరసవాడ), టి.రాజేశ్వరి(టెక్కలి), ఎం.అరుణ(ధర్మవరం), జి.లక్ష్మి(పెద్దసీది), వై.శ్రీలక్ష్మి(జి.ఎస్.పురం), వి.విమల(వమరవల్లి), ఐ.పద్మావతి(పనసవలస), ఎస్.రమావతి(నరసన్నపేట), కె.విజయ(కోడూరు), పి.రాజేశ్వరి(తొగరాం), స్టాండ్‌బైస్‌గా జె.చిట్టితల్లి(సంతకవిటి), డి.లత (టెక్కలి) ఎంపికయ్యారు. శిక్షకులు, మేనేజర్లుగా పి.తవిటయ్య(పలాస), వి.పుష్పనాధం(తలవరం), జి.ఎం.జ్యోతి(నరసన్నపేట), పి.దుర్గయ్య(సంతకవిటి) వ్యవహరిస్తారని తెలిపారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి