ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

అనుమతి లేకుండా విగ్రహాల ఏర్పాటు తగదు

నర్సీపట్నం, నవంబర్ 21(చైతన్యవారధి): పంచాయతీ అనుమతి లేకుండా కొత్తవీధిలో ఇందిరమ్మ విగ్రహం ఏర్పాటు సరికాదని సర్పంచ్ చింతకాయల సన్యాసిపాత్రుడు అన్నారు. ఆయన తన స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్‌పార్టీ నాయకులు వారి ఇష్టారాజ్యంగా పట్టణంలో దేశ నాయకుల విగ్రహాలు ఏర్పాటుచేస్తున్నారన్నారు. ఎవరైనా విగ్రహాలు ఏర్పాటుచేయాలనుకుంటే పంచాయతీ అనుమతి విధిగా పొందాలన్నారు. కొత్తవీధిలో ఇందిరమ్మ విగ్రహం ఏర్పాటు వల్ల జరిగిన వివాదం దృష్ట్యా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పట్టణంలో చాలా చోట్ల రోడ్లపై విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ అధికారులు, పోలీసులు పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కొత్తవీధిలో విగ్ర హం ఏర్పాటులో వివాదముందని తెలిసికూడా ఎమ్మెల్యే ముత్యాలపాప ఆవిష్కరణ సభకు రావడం దురదృష్టకరమన్నారు. గ్రామాభివృద్ధికి సర్పంచ్ ఏంచేశారని ఎమ్మెల్యే ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. కొత్తవీధిలో రామాలయం, పాఠశాల భవనం, వీధి కుళాయిలు, సిమెంట్ రోడ్లు, శ్మశాన వాటిక ఏర్పాటు వంటి అభివృద్ధి పనులు చేశామన్నారు. పట్టణంలో పంచాయతీ అనుమతి లేకుండా ఏర్పాటుచేసిన విగ్రహాలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రావాడ నాయుడు, ఎంపీటీసీ సభ్యుడు మాకిరెడ్డి అప్పారావు, తెలుగుదేశం టౌన్ కార్యదర్శి కామిరెడ్డి రామారావు పాల్గొన్నారు.

కామెంట్‌లు