Loading...
22, నవంబర్ 2010, సోమవారం
సోనియా దిష్టిబొమ్మ దహనం
విశాఖపట్టణం, నవంబరు21(చైతన్యవారధి): సాక్షి కార్యాలయాల వద్ద కాంగ్రెస్ శ్రేణులు చేపట్టిన ఆందోళన కార్యక్రమాలను నిరసిస్తూ జగన్‌యువసేన సభ్యులు ఆదివారం ఏయూలో సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. సోనియాగాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పత్రికా స్వేచ్ఛతో ఏ అంశమైనా ప్రచురించే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో జగన్‌యువసేన సభ్యులు శ్యామ్, మోహన్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.సోనియా చిత్రపటానికి క్షీరాభిషేకం: ఏయూలో సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేసినందుకు నిరసనగా నగర కాంగ్రెస్ కార్యకర్తలు ఆమె చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు హేమంత్‌కుమార్, పీసీసీ సభ్యుడు నారాయణరావు, ఉత్తరాంధ్ర విద్యార్థిసేన అధ్యక్షుడు రమణమూర్తి, భవానీశంకర్ తదితరులు పాల్గొన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి