పరవాడ, నవంబర్ 15: ఫ్లైయాష్ ను సముద్రంలో వదలడం వల్ల ఉపాధి కోల్పోతున్నామంటూ మండలంలోని ముత్యాలమ్మపాలెం శివారు తిక్కవానిపాలెం మత్స్యకార మహిళలు సింహాద్రి ఎన్టీపీసీ ముందు సోమవారం ఆందోళనకు దిగారు. సంస్థ పరిపాలనా భవనం ముందు భవనం ముందు బయిటాయించి ఉపాధి కల్పించాలని నినాధాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింహాద్రి అధికారులు నీటితో ఫ్లైయాష్‌ను కలిపి ఇటీవల ఇబ్బడిముబ్బడిగా సముద్రంలో విడుదల చేస్తున్నారని, దీని కారణంగా పరిసర ప్రాంతాల్లో జలచరాలు కనిపించకుండా పోతున్నాయన్నారు. దీనివల్ల మత్స్యకారుల వలలకు చేపలు చిక్కకపోవడంతో ఉపాధి కోల్పోతున్నామని వారంతా వాపోతున్నారు. ఉపాధి కోల్పోయిన తిక్కవానిపాలెం మత్స్యకారులకు సింహాద్రి ప్రాజెక్ట్‌లో ఉపాధి కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.Loading...
16, నవంబర్ 2010, మంగళవారం
సింహాద్రి ఎన్టీపీసీ ముందు మహిళల ఆందోళన
పరవాడ, నవంబర్ 15: ఫ్లైయాష్ ను సముద్రంలో వదలడం వల్ల ఉపాధి కోల్పోతున్నామంటూ మండలంలోని ముత్యాలమ్మపాలెం శివారు తిక్కవానిపాలెం మత్స్యకార మహిళలు సింహాద్రి ఎన్టీపీసీ ముందు సోమవారం ఆందోళనకు దిగారు. సంస్థ పరిపాలనా భవనం ముందు భవనం ముందు బయిటాయించి ఉపాధి కల్పించాలని నినాధాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింహాద్రి అధికారులు నీటితో ఫ్లైయాష్‌ను కలిపి ఇటీవల ఇబ్బడిముబ్బడిగా సముద్రంలో విడుదల చేస్తున్నారని, దీని కారణంగా పరిసర ప్రాంతాల్లో జలచరాలు కనిపించకుండా పోతున్నాయన్నారు. దీనివల్ల మత్స్యకారుల వలలకు చేపలు చిక్కకపోవడంతో ఉపాధి కోల్పోతున్నామని వారంతా వాపోతున్నారు. ఉపాధి కోల్పోయిన తిక్కవానిపాలెం మత్స్యకారులకు సింహాద్రి ప్రాజెక్ట్‌లో ఉపాధి కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి